Rain Alert: ఏపీలో వర్షాలపై కీలక అప్‌డేట్
ABN , Publish Date - Dec 19 , 2024 | 03:24 PM
Andhrapradesh: రానున్న రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గురువారం ప్రకటన చేశారు. ప్రసుత్తం తీవ్ర అల్పపీడం నైరుతీ బంగాళా ఖాతం, పశ్చిమ మధ్య బంగాళా ఖాతం వద్ద కేంద్రీకృతం అయి ఉందని తెలిపారు.

విశాఖపట్నం, డిసెంబర్ 19: ఏపీ వర్షాలపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రసుత్తం తీవ్ర అల్పపీడం నైరుతీ బంగాళా ఖాతం, పశ్చిమ మధ్య బంగాళా ఖాతం వద్ద కేంద్రీకృతం అయి ఉందని తెలిపారు. తీవ్ర అల్పపీడంగా కొనసాగుతోందని.. దీని ప్రభావం కారణంతో దక్షిణ, ఉత్తర కోస్తాలో మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు.
రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్
ఈ ప్రభావం కారణంగా దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో వర్షాలు పడతాయని.. కొన్ని జిల్లాలకు వర్షం సూచన ఉందన్నారు. విశాఖ, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా ప్రకాశం, నెల్లూరు వర్ష సూచన ఉంద కొన్ని జిల్లాలో భారీ వర్షం పడవచ్చని అన్నారు. గత 24 గంటలులో ఉత్తరాంధ్రలో ఓ మోసారు వర్షాలు పడ్డాయని... విజయగరంలో జిల్లాలో 3 సెంటీ మీటర్ల వర్షం నమోదు అయిందని తెలిపారు. వర్షాలు ఈరోజు, రేపు (శుక్రవారం) పడే అవకాశాలు ఉన్నాయన్నారు.
వాళ్ల వేధింపులతోనే అశ్విన్ రిటైర్మెంట్
తీరం వెంబడి బలమైన ఈదురు గాలులువీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే గంటకు 35 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీ పట్నం పోర్టులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: భర్త మోసం చేశాడని భార్యకు వేధింపులు
వాహనదారులకు షాక్.. హైకోర్టు సంచలన ఆదేశాలు..
Read Latest AP News And Telugu News