Share News

విజయ గణపతి దేవాలయ ప్రతిష్ఠ

ABN , Publish Date - Mar 21 , 2024 | 12:49 AM

కడవకొల్లు పంచాయతీ పరిధి వీరవల్లి మొఖాసలో శ్రీవిజయగణపతి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామానికి చెందిన జొన్నలగడ్డ రాంబాబు, బసవరాజ్యం, గ్రామస్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన ఆలయంలో మూడు రోజులుగా పూజాది కార ్యక్రమాలు నిర్వహించారు.

విజయ గణపతి దేవాలయ ప్రతిష్ఠ
విగ్రహాలకు పూజలు, అభిషేకాలు చేస్తున్న పండితులు

వీరవల్లి మొఖాస(ఉయ్యూరు), మార్చి 20 : కడవకొల్లు పంచాయతీ పరిధి వీరవల్లి మొఖాసలో శ్రీవిజయగణపతి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామానికి చెందిన జొన్నలగడ్డ రాంబాబు, బసవరాజ్యం, గ్రామస్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన ఆలయంలో మూడు రోజులుగా పూజాది కార ్యక్రమాలు నిర్వహించారు. మూడోరోజు ఉదయం గణపతి పూజ, పుణ్యాహ వాచనం తదుపరి శ్రీవిజయ గణపతి సహిత, ఆంజనేయ, గోపాలకృష్ణ, కోదండరామ, హయగ్రీవ వెంకటేశ్వరస్వామి యంత్ర, విగ్రహ, శిఖర ప్రతిష్టాపన, తదుపరి విగ్రహ ప్రాణ పతిష్టాపన చేశారు. కుంబాభిషేకం, శాంతి కళ్యాణం, మహాదాశీర్వచనం నేత్ర పర్వంగా చేశారు. టీడీపీ నాయకులు కేపీ సారథి, వర్ల కుమార్‌రాజా, తుమ్మల బుడ్డియ్య, పీఏసీఎస్‌ మాజీ చైర్‌పర్సన్‌ జొన్నలగడ్డ తాతా సురేశ్‌బాబు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కడవకొల్లు, పరిసర గ్రామల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ అన్నసమారాధన చేశారు.

ఘనంగా వేణుగోపాలస్వామి ఆలయ వార్షికోత్సవం

పెనమలూరు : కానూరు వేణుగోపాలస్వామి ఆలయ వార్షికోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నే సుజాత వేణుగోపాలకృష్ణమూర్తి దంపతుల ఆధ్వర్యంలో ఆరువేల మందికిపైగా భక్తులకు అన్నసంతర్పణ గావించారు.

తిరుపతమ్మ, గోపయ్యస్వామి కల్యాణోత్సవం

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌ : వీరవల్లిలో తిరుపతమ్మ, గోపయ్య స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య 8మంది దంపతులు కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. గ్రామోత్సవం, ప్రభల ఊరేగింపు నిర్వహించారు.

సామూహిక వేంకటేశ్వరస్వామి వ్రతం

హనుమాన్‌జంక్షన్‌ : స్థానిక లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుఽధవారం ఏకాదశిని పురస్కరించుకొని సామూహిక వేంకటేశ్వరస్వామి వత్రం ఘనంగా నిర్వ హించారు. ఆలయ ఈవో శ్రీనివాస్‌ పర్యవేక్షణలో అర్చకులు చక్రావధానుల సీతా రామాచార్యులు వ్రత కార్యక్రమాన్ని జరిపారు. కార్యక్రమంలో ట్రస్టీ తవ్వా పూర్ణచం ద్రరావు, ఆలయ సిబ్బంది ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2024 | 12:49 AM