Share News

నేడు డీఐజీగా కోయ ప్రవీణ్‌ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jul 18 , 2024 | 11:23 PM

కర్నూలు రేంజ్‌ డీఐజీగా డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ శుక్రవారం బాధ్యతలు తీసుకోను న్నారు. విశాఖపట్నం గ్రేహౌండ్స్‌ డీఐజీగా పని చేస్తున్న ఈయన ఇటీవల జరిగిన బదిలీల్లో కర్నూలు రేంజ్‌ డీఐజీగా బదిలీ అయ్యారు.

నేడు డీఐజీగా కోయ ప్రవీణ్‌ బాధ్యతల స్వీకరణ

కర్నూలు, జూలై 18: కర్నూలు రేంజ్‌ డీఐజీగా డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ శుక్రవారం బాధ్యతలు తీసుకోను న్నారు. విశాఖపట్నం గ్రేహౌండ్స్‌ డీఐజీగా పని చేస్తున్న ఈయన ఇటీవల జరిగిన బదిలీల్లో కర్నూలు రేంజ్‌ డీఐజీగా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఆయన కర్నూలుకు చేరుకున్నారు. స్థానిక పోలీసు అతిథిగృహం చేరుకున్న ఆయనకు ప్రస్తుత డీఐజీతో పాటు కర్నూలు, నంద్యాల ఎస్పీలు, డీఎస్పీలు స్వాగతం పలికారు. ప్రస్తుత డీఐజీ విజయరావును డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. బదిలీపై వెళ్తున్న విజయరావుకు గురువారం రాత్రి వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. కర్నూలు, నంద్యాల ఎస్పీలతో పాటు పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఈ సభలో పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2024 | 11:23 PM