Share News

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:48 PM

టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
బనగానపల్లెలో టీడీపీ జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి బీసీ

ఎన్టీఆర్‌కు నివాళి అర్పించిన మంత్రులు

నంద్యాల మున్సిపాలిటీ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస కూడలిలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి రాష్ట్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన వెంట పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గుంటుపల్లి హరిబాబు తదితరులు ఉన్నారు.

బనగానపల్లె: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్‌ ఆశయాలను కొనసాగిస్తామని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లె పట్టణంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి బీసీ విలేకరులతో మాట్లాడుతూ బడగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం టీడీపీ కృషి చేస్తోందన్నారు. ఉప సర్పంచ్‌ బురానుద్దీన్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాయలసీమ సలాం, పులి ప్రకాశ్‌రెడ్డి, బాబయ్య, కృష్ణానాయక్‌, ఇస్మాయిల్‌ఖాన్‌, అల్తాఫ్‌ హుసేన్‌, ఖాదర్‌, ఇమ్ము, నియాజ్‌, సబ్బీర్‌, రజాక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 11:48 PM