Share News

నవ్వాలా... ఏడ్చాలా?

ABN , Publish Date - May 03 , 2024 | 05:05 AM

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అంటే... అన్నపూర్ణ, అమరావతి, గోవిందుడి తిరుపతి, సాగర నగరి విశాఖపట్నం, ఇంకా ఎన్నెన్నో

నవ్వాలా... ఏడ్చాలా?

కామెడీ సరుకుగా మారిన ఏపీ

స్టాండప్‌ కమెడియన్ల పరాచికాలు

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అంటే... అన్నపూర్ణ, అమరావతి, గోవిందుడి తిరుపతి, సాగర నగరి విశాఖపట్నం, ఇంకా ఎన్నెన్నో! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అంటే స్టాండప్‌ కమెడియన్లకు కావాల్సిన సరుకుగా మారిపోయింది. ‘మొన్నే విశాఖకువెళ్లా’ అంటూ ఇటీవల ఒక స్టాండప్‌ కమెడియన్‌ చెప్పిన మాటలు... షో విన్న వారికి బాగా నవ్వు తెప్పించాయి. కానీ... రాష్ట్రాన్ని అభిమానించే వాళ్లకు మాత్రం ఆవేదనే మిగిల్చేవే! ఆ ‘కామెడీ’ ఇలా సాగింది...

‘‘మొన్న విశాఖపట్నం వెళ్లాను! మనం ఒకే చోటికి రెండోసారి వెళితే... చాలా నిర్మాణాలు చిన్నగా కనిపిస్తాయి! (ఇంకా విషయంలోకి రాకముందే ప్రేక్షకుల్లోంచి ఒకరు జై జగన్‌ అని అరిచారు... నవ్వులు!) నాకు రుషికొండ హిల్‌ కూడా చిన్నగా కనిపించింది. అంతేకాదు... గీతం యూనివర్సిటీని ‘ఓపెన్‌ యూనివర్సిటీ’లా మార్చేసిన విధానం సూపర్‌! కాంపౌండ్‌లు ఏవీ లేవు... ఎవరైనా లోపలికి వెళ్లిపోవచ్చు. (జగన్‌ సర్కారు గీతం వర్సిటీ ప్రహరీలను కూల్చేసిందని చెబుతూ!). ఇక ఫ్లోటింగ్‌ బ్రిడ్జి పేరుకు తగినట్లే సముద్రంలో ‘ఫ్లోట్‌’ అవుతూ వెళ్లిపోయిందట. హమ్మో... విశాఖలో, మొత్తంగా ఏపీలో జాగ్రత్తగా మాట్లాడాల్సిందే! మీకు కోపమొస్తే సీఎంపైనే రాళ్లేస్తారు. ఇక్కడ ఏం చేయకపోవచ్చుకానీ... షో తర్వాత నేను బయటికి వెళ్లాల్సి ఉంటుంది కదా! మా ఇళ్లు ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరం! నడిచే పోవాలి. నాకోసం హెలికాప్టర్‌ కూడా రాదు! (జగన్‌ దగ్గరి దూరాలకు కూడా హెలికాప్టర్‌ వాడటాన్ని గుర్తు చేస్తూ)

- ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం

Updated Date - May 03 , 2024 | 05:05 AM