Minister Narayana: మున్సిపల్ కార్పోరేషన్‌లపై మంత్రి సమీక్ష.. రూ.14831 కోట్లు పెండింగ్..
ABN , Publish Date - Jun 28 , 2024 | 12:47 PM
మున్సిపల్ కార్పోరేషన్‌లపై సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్ బిల్లులు పేరుకుపోవడంపై ఆరా తీశారు. మొత్తం 851 బిల్లులకు సంబంధించి రూ.14831 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు లెక్కల్లో తేలింది.
అమరావతి: మున్సిపల్ కార్పోరేషన్‌లపై సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్ బిల్లులు పేరుకుపోవడంపై ఆరా తీశారు. మొత్తం 851 బిల్లులకు సంబంధించి రూ.14831 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు లెక్కల్లో తేలింది. కొన్ని ఖాతాల్లో ఉన్న నిధుల కంటే ఖర్చే ఎక్కువ. పట్టణాలను నిలువునా వైసీపీ సర్కార్ ముంచేసింది. తద్వారా కూటమి ప్రభుత్వంపై బకాయిల భారం పడింది. కార్పొరేషన్లలో సాధారణ నిధుల కింద చేపట్టిన పనులు, పథకాలకు సంబంధించి రూ.10232 కోట్ల బకాయిలు ఉన్నట్టు తేలింది.
రోడ్లు, డ్రైన్లు, భవనాలు, వీధిలైట్లు, తాగునీటి సరఫరాకు సంబంధించి రూ.246 కోట్లు పెండింగ్ ఉన్నట్టు తెలుస్తోంద. గత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కింద రూ.2532 కోట్ల పనులు చేయించింది. ఈ బిల్లులు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1730 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది కేవలం రూ.523 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. మిగలిన మొత్తం రూ.1206 కోట్లు ఇతర నవరత్నాలకు మళ్లించడం జరిగింది. దీంతో కాంట్రాక్టర్లకు బిల్లులు అందక పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. దీనిపై రివ్యూ కొనసాగుతోంది. స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టుపైనా మంత్రి నారాయణ సమీక్షిస్తున్నారు.