Share News

CM Jagan: జగన్ యాత్రలు.. జనానికి తిప్పలు..

ABN , Publish Date - Apr 15 , 2024 | 10:38 AM

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి యాత్రలేమో కానీ వీటి కారణంగా జనానికి చచ్చినంత పనవుతోంది. చెట్లు పెంచాలంటూ ప్రభుత్వాలే చెబుతాయి. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్. జగన్ యాత్ర అంటే చాలు.. ఆ ఏరియాలో చెట్లన్నీ కొలాప్స్. అధికారులు వాటన్నింటినీ అడ్డంగా నరికేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుంది.

CM Jagan: జగన్ యాత్రలు.. జనానికి తిప్పలు..

పశ్చిమ గోదావరి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) యాత్రలేమో కానీ వీటి కారణంగా జనానికి చచ్చినంత పనవుతోంది. చెట్లు పెంచాలంటూ ప్రభుత్వాలే చెబుతాయి. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్. జగన్ యాత్ర అంటే చాలు.. ఆ ఏరియాలో చెట్లన్నీ కొలాప్స్. అధికారులు వాటన్నింటినీ అడ్డంగా నరికేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. బస్సు యాత్ర సందర్భంగా రోడ్డు పక్కన చెట్లను నరికివేశారు. భీమవరంలో సభ ముగించుకుని ఉండి.. గణపవరం మీదుగా బస్సు యాత్ర వెళ్ళనుంది. ఉండి.. గణపవరం రోడ్డులో కోలమూరు వద్ద రోడ్డు పక్కన చెట్లను అధికారులు నరికి వేయిస్తున్నారు.

TS News: కోకాపేటలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. ఓ వ్యక్తిని ఆటోలో ఎక్కించుకుని..


తాజాగా జగన్ రాళ్ల దాడిలో గాయపడిన విషయం తెలిసిందే. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో బస్సు యాత్రకు కాస్త విరామం ప్రకటించారు. దీంతో ఆయన రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని తిరిగి రేపటి నుంచి ఆయన బస్సు యాత్ర చేపట్టనున్నారు. కాగా.. శనివారం రాత్రి ఆగంతకులు ఆయనపై రాయి విసిరారు. నిజానికి ఎన్నికలు వస్తున్నాయంటే జగన్‌కి ఏదో ఒకటి జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో కోడికత్తి దాడి.. ఈ ఎన్నికల సమయంలో రాయి విసిరారు. ఇదంతా జగన్ కావాలనే చేయించుకుంటున్నారని విపక్షాలు అంటున్నాయి. ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ అని వ్యాఖ్యానిస్తున్నాయి.

AP Politics: ఓటమిని తట్టుకోలేకనే విషసంస్కృతికి జగన్ తెర.. రాళ్ల దాడిపై కొల్లు రవీంద్ర


ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ రెండు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అవేంటంటే.. దెబ్బతగిలిందని నటించబోయే ముందు... కెమెరా ముందు నటించేటప్పుడు జగన్ అంటూ రెండు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ దాడి టీడీపీ అధినేత చంద్రబాబే చేయించారని వైసీపీ ఆరోపిస్తోంది. విజయవాడలో సీఎం వైయస్ జగన్‌పై గూండాలతో చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య. రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు’’ అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టింది.

TDP: చంద్రబాబుపై రాళ్ల దాడి వెనుక వైసీపీ హస్తం?

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 15 , 2024 | 11:23 AM