Special trains: గుంతకల్లు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు..
ABN , Publish Date - Dec 12 , 2024 | 11:59 AM
గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా శబరిమల(Shabari mala)కు సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు-కొల్లాం(Guntur-Kollam) ప్రత్యేక రైలు (నం. 07181) జనవరి 4, 11, 18 తేదీల్లో రాత్రి 11-45 గంటలకు గుంటూరులో బయలుదేరి 6, 13, 20 తేదీల్లో ఉదయం 6-20 గంటలకు కొల్లాంకు చేరుకుంటుందన్నారు.
గుంతకల్లు: గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా శబరిమల(Shabari mala)కు సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు-కొల్లాం(Guntur-Kollam) ప్రత్యేక రైలు (నం. 07181) జనవరి 4, 11, 18 తేదీల్లో రాత్రి 11-45 గంటలకు గుంటూరులో బయలుదేరి 6, 13, 20 తేదీల్లో ఉదయం 6-20 గంటలకు కొల్లాంకు చేరుకుంటుందన్నారు. అలాగే కొల్లాం-గుంటూరు ప్రత్యేక రైలు (నం. 07185) జనవరి 13, 20 తేదీల్లో ఉదయం 10-45 గంటలకు కొల్లాంలో బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 4 గంటలకు గుంటూరుకు చేరుకుంటుందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: YSRCP: వైసీపీకి మరో భారీ షాక్.. రాజీనామా యోచనలో కీలక నేత
ఈ రైళ్లు నరసరావుపేట, దొనకొండ, మార్కాపురం రోడ్డు(Narasaraopet, Donakonda, Markapuram Road), గిద్దలూరు, దిగువమిట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పీలేరు, పాకాల, చిత్తూరు, కాట్పాడి, జొలార్‌పట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూరు, పొదనూరు, పలక్కడ్, త్రిసుర్, అలువ, ఎర్నాకులం టౌన్, ఎట్టుమనుర్, కొట్టాయం, తిరువల్ల, చెంగనూరు, కాయంకుళం స్టేషన్ల మీదుగా వెళ్తాయన్నారు. కొల్లాం-కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (నం. 07182) జనవరి 2న ఉదయం 10-45 గంటలకు కొల్లాంలో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుతుందన్నారు.
ఈ రైలు కాయంకుళం, చెంగనూరు, తిరువల్ల, కొట్టాయం, ఎట్టుచలయెర్, ఎర్నాకులం టౌన్, అలువ, త్రిసుర్, పలక్కడ్, పొదనూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జొలార్‌పట్టై, కాట్పాడి, చిత్తూరు, పాకాల, పీలేరు, మదనపల్లి, కదిరి, ధర్మవరం(Chittoor, Pakala, Peeleru, Madanapalle, Kadiri, Dharmavaram), అనంతపురం, గుత్తి, డోన్, బెతంచెర్ల, నంద్యాల, దిగువమెట్ట, గిద్దలూరు, మార్కాపురం రోడ్డు, దొనకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే
ఈవార్తను కూడా చదవండి: హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనల్లో.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై అనుమానాలు
ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్: కవిత
ఈవార్తను కూడా చదవండి: ఉత్తమ పార్లమెంటేరియన్ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్ అవార్డు
Read Latest Telangana News and National News