అమరావతిలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటు
ABN , Publish Date - Oct 06 , 2024 | 05:44 AM
పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాజధాని అమరావతిలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు చర్యలు చేపడతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు.
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్
విశాఖపట్నం(స్పోర్ట్సు), అక్టోబరు 5: పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాజధాని అమరావతిలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు చర్యలు చేపడతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ నిర్వహించిన ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) రెండో వైజాగ్ ఓపెన్ టోర్నీలో అంగద్ చీమా చాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకోగా, అమాండ్ రన్నర్‌పగా నిలిచాడు.
శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి.. విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్ఫ్ క్రీడను అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తగిన అవకాశాలు కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉన్న క్రీడాకారులు ఏపీలో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా సీఈవో ఉత్తమసింగ్ మండే, డైరెక్టర్ వికా్‌ససింగ్, ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ కార్యదర్శి ఎంఎ్‌సఎన్ రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.