Jawahar reddy: సీఎస్‌పై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు
ABN , Publish Date - Apr 09 , 2024 | 05:43 PM
న్యూఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు మంగళవారం ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘానికి వారు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని మానవ హక్కుల సంఘానికి వారు విజ్జప్తి చేశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 09: న్యూఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు మంగళవారం ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘానికి వారు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని మానవ హక్కుల సంఘానికి వారు విజ్జప్తి చేశారు.
Margadarsi: మార్గదర్శి వ్యవహారంలో ఉండవల్లికి సుప్రీం సూచన
పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి... ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. ఆ ఆదేశాలను ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పక్కదారి పట్టించారని ఆ పిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా 33 మంది మరణించారని వారు ఈ సందర్భంగా మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. కదలలేని స్థితిలో ఉన్న వారిని బలవంతంగా గ్రామ సచివాలయాలకు రావాల్సిందేనని వైసీపీ నేతలు చేసిన ప్రచారం కారణంగానే.. వారంతా మరణించారని చెప్పారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండి... అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జవహర్ రెడ్డిపై ఆ పిర్యాదులో పేర్కొన్నారు. కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. అలాగే పెన్షనర్లకు వారి ఇంటి వద్దే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది,
AP Elections: వలంటీర్లకు చంద్రబాబు బంపరాఫర్
ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్ అందించేలా ప్రధాన కార్యదర్శికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మానవ హక్కుల సంఘాన్ని కూటమి నేతలు కోరారు. ఇప్పటికే అధికార వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఇక పెన్షన్ల పంపిణీకి అవసరమైన నిధులు సకాలంలో సమకూర్చడంలో విఫలమైన ఇతర ఉన్నతాధికారులపై సైతం చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా మానవ హక్కుల సంఘాన్ని నేతలు కోరారు.
ఆంప్రదేశ్ వార్తలు కోసం..