హెచ్‌ఏఎంఎస్‌ఏ అనకాపల్లి తాలుకా నూతన కార్యవర్గం
ABN , Publish Date - May 28 , 2024 | 12:43 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏపీహెచ్‌ఏఎంఎస్‌ఏ (హంస) విశాఖ ఉమ్మడి జిల్లా అనకాపల్లి తాలుకా యూనిట్ కార్యవర్గం ఎన్నిక సోమవారం జరిగింది.

అనకాపల్లి టౌన్, మే 27: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏపీహెచ్‌ఏఎంఎస్‌ఏ (హంస) విశాఖ ఉమ్మడి జిల్లా అనకాపల్లి తాలుకా యూనిట్ కార్యవర్గం ఎన్నిక సోమవారం జరిగింది. తాలుకా యూనిట్ అధ్యక్షులుగా డి. మహేష్, కార్యదర్శిగా ఎ. రామస్వామి, కోశాధికారిగా కె. మంగరాజు ఎన్నికయ్యారు. ఇతర కార్యవర్గసభ్యులు కూడా ఎన్నికయ్యారు. జోన్-1 కో-ఆర్డినేటర్ డి.సూరిబాబు, బి.శ్రీకాంత్, ఎన్.ఎన్. శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో డి.చినబాబు, ఎన్.బాబి, ఆంజనేయులు. తనకాల సత్యనారాయణ తదితరులు పాల్గొని ఎన్నికైన వారిని అభినందించారు. ఎన్నికైన ప్రతినిధులను డీఎంహెచ్‌ఓ డాక్టర్ హేమంత్ అభినందించారు.