Perni Nani: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపుపై ఫిర్యాదు..
ABN , Publish Date - May 28 , 2024 | 01:40 PM
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపుపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారన్నారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారన్నారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలని.. అలాగేస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారన్నారు.
అమరావతి: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపుపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారన్నారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారన్నారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలని.. అలాగేస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించబోమని అన్నారని పేర్ని నాని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనిది.. ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందన్నారు. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదన్నారు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందని పేర్ని నాని అన్నారు. ఎన్నికల కమిషన్ చెప్పని నిబంధనలను ఎలా అమాలు చేస్తారని ఆడిగామని తెలిపారు. ఈ నిబంధనలపై పునరాలోచించాలని కోరామన్నారు.
Alapati Raja: తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది ఒక్క ఎన్టీఆరే..
అనంతరం వైసీపీ నేత మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో అలజడులు సృష్టించారన్నారు. పేదల పైన టీడీపీ నేతలు దాడులు చేస్తే ఎన్నికల కమిషన్, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోలేదన్నారు. ఆఖరికి ఈసీఐ నిబంధనలని కూడా ఏపీలో మార్చేస్తున్నారన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈసీఐకి విరుద్ధంగా సీఈఓ ఆదేశాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే ఆ నిబంధనలను ఉపసంహరించుకోవాలన్నారు. స్పెసిమెన్ సంతకం ద్వారా ఆమోదించడం సమంజసం కాదన్నారు. పోలింగ్ నాడు టీడీపీ అక్రమాలకు పాల్పడిందని.. ఇప్పుడు లెక్కింపు సక్రమంగా జరగకూడదని కుట్ర చేస్తోందని మేరుగ నాగార్జున అన్నారు.
బిల్డర్ మధు హత్య వెనుక ప్రేమ కథ..!