Narayana: జనవరి నుంచీ రాజధానిలో పనులు ప్రారంభం
ABN , Publish Date - Nov 29 , 2024 | 07:30 PM
2014లో రాష్ట్ర విభజన జరిగింది. అదే సమయంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. రాజధాని లేని రాష్ట్రం కావడంతో.. రాజధాని కోసం అన్వేషణ సాగింది.
అమరావతి, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పనులు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతాయని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. అమరావతి ప్రాంతంలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్బంగా కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటి వివరాలను మంత్రి పొంగూరి నారాయణ వివరించారు.
Also Read: గత ప్రభుత్వ భూ కబ్జాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాలు కేటాయింపునకు సబ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్‌కు 5 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 0.8 ఎకరాలు కేటాయించామని చెప్పారు. ఇక బసవ తారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు 15 ఎకరాలు కేటాయించామని వివరించారు. ఎల్ అండ్ టీ (లార్సన్ అండ్ టర్బో) స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి 5 ఎకరాలు కేటాయించామన్నారు. బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీకి 10 ఎకరాలు కేటాయించామని తెలిపారు.
Also Read: కేసీఆర్ దీక్ష ఫేక్.. విచారణ జరపాలి
టీటీడీకి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు కేబినెట్ సబ్ కమిటీ పూర్తి అంగీకారం తెలిపిందని వివరించారు. గతంలో 131 మందికి భూములు ఇచ్చామని.. వాటితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నామని తెలిపారు. అయితే గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నామన్నారు. ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని ఈ సందర్బంగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Also Read: భారీ వర్షాలు.. ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
వచ్చే నెలాఖరులోగా భూకేటాయింపులు పూర్తవ్వాలని ఉన్నతాధికారులను ఇప్పటికే ఆదేశించామని చెప్పారు. ఈ డిసెంబరు నెలాఖరుకల్లా 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. వచ్చే జనవరి నుంచీ రాజధానిలో పనులు ప్రారంభమవుతాయని మంత్రి పి.నారాయణ వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన పలు సంస్థలకు సమయం ముగియడంతో మరోసారి వాటి గడువు పొడిగించినట్లు చెప్పారు.
Also Read: విజన్ డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
2014లో రాష్ట్ర విభజన జరిగింది. అదే సమయంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. రాజధాని లేని రాష్ట్రం కావడంతో.. రాజధాని కోసం అన్వేషణ సాగింది. ఆ క్రమంలో రాజధానిగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తుళ్లూరు ప్రాంతంలోని మొత్తం 29 గ్రామాలను ఎంపిక చేసి.. దానినికి అమరావతి అని పేరు పెట్టారు.
Also Read: మినపప్పు వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
ఇక రైతులను ఒప్పించి పంట భూములను వారి నుంచి తీసుకునేందుకు నాటి ప్రభుత్వం మహాయజ్జమే చేసిందని చెప్పాలి. రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగి. నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇంతలో 2019 ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఓటరు వైసీపీకి పట్టం కట్టాడు. దీంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టారు.
అనంతరం రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ప్రకటన చేశారు. దీంతో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన బాట పట్టారు. నాటి నుంచి వారు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు, పాదయాత్రలు చేసినా.. వైసీపీ ప్రభుత్వ పెద్దల మనస్సు మాత్రం కరగలేదు.
మళ్లీ 2024లో ఎన్నికలు రానే వచ్చాయి. దీంతో కూమిటికి ఓటరు పట్టం కట్టారు. దాంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో అమరావతికి పూర్వ వైభవం రానే వచ్చింది. రాజధానిలో నిర్మాణాలే కాదు.. ఆంధ్ర రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సైతం ఊపందుకుంది. ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో భూ కేటాయింపులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ.. శుక్రవారం సమావేశమైంది. అందులోభాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
For AndhraPradesh news And Telugu news