Share News

iPhone 16: ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో సిద్ధార్థ దంపతులు.. టిమ్‌ కుక్‌తో ముచ్చట్లు

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:59 AM

యాపిల్ 16 సిరీస్ ఫోన్ల (APPLE 16) ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం అమెరికాలో సందడిగా జరిగింది. టెక్ ప్రపంచాన్ని ఆకర్షించిన ఈ ఈవెంట్‌లో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. భారత్‌కు చెందిన నటులు హీరో సిద్ధార్థ, హీరోయిన్ అదితి రావు హైదరీ దంపతులు యాపిల్ ఈవెంట్‌లో తళుక్కున మెరిశారు.

iPhone 16: ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో సిద్ధార్థ దంపతులు.. టిమ్‌ కుక్‌తో ముచ్చట్లు

యాపిల్ 16 సిరీస్ ఫోన్ల (APPLE 16) ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం అమెరికాలో సందడిగా జరిగింది. టెక్ ప్రపంచాన్ని ఆకర్షించిన ఈ ఈవెంట్‌లో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. భారత్‌కు చెందిన నటులు హీరో సిద్ధార్థ, హీరోయిన్ అదితి రావు హైదరీ దంపతులు యాపిల్ ఈవెంట్‌లో తళుక్కున మెరిశారు. వీరిద్దరూ యాపిల్ కంపెనీ అధినేత టిమ్ కుక్‌తో కాసేపు సరదాగా గడిపారు. అమెరికాలోని యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగిన లాంచ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఇరువురు రెండు రోజుల సమయాన్ని కేటాయించారు. ఈ విషయాన్ని అదితి రావు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.


యాపిల్ 16 ఫోన్ల లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఇది మరపురాని, మ్యాజికల్ అనుభూతి అని అన్నారు. మంచితనం, దయాగుణం కలిగిన టిమ్ కుక్‌ తమతో కొద్దిసేపు గడిపారని, అందుకు ధన్యవాదాలు అంటూ అదితి రావు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేశారు. ‘‘ ఆసక్తి కలిగించే వాతావరణం, అత్యున్నత సాంకేతిక, సృజనాత్మకలతో కూడిన గడిచిన రెండు రోజులు మా ఇద్దరికీ చాలా ప్రత్యేకమైనవి. యాపిల్ సమస్త వ్యవస్థను నడిపిస్తున్న వ్యక్తులను కలవడం వీటన్నికంటే చాలా ప్రత్యేకమైనది. మంచి గుణం కలిగిన క్రియేటర్లు, ప్రేమాభిమానాలు కలిగిన మేధావులు. విశాలమైన హృదయాలతో ఉన్నారు. మా హృదయాలు నిండిపోయాయి. మనసులు పునరుత్తేజాన్ని పొందాయి’’ అంటూ అతిది రావు వ్యాఖ్యానించారు.


యాపిల్-16 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్..

ప్రపంచ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఐఫోన్‌ 16 సిరీ స్‌ను ఆవిష్కరించింది. అమెరికా, కాలిఫోర్నియాలోని కపర్టినోలో ఉన్న యాపిల్‌ పార్క్‌లో సోమవారం నిర్వహించిన ‘ఇట్స్‌ గ్లో టైమ్‌’ కార్యక్రమంలో కొత్త ఫోన్లను లాంచ్‌ చేసింది. ఏ 18 బయోనిక్‌ చిప్‌, యాపిల్‌ ఇంటెలిజెన్స్‌, విజువల్‌ ఇంటెలిజెన్స్‌, చాట్‌జీపీటీ వంటి ఆధునిక సాంకేతికతలతోపాటు ప్రైవేట్‌ క్లౌడ్‌ కంప్యూట్‌, కెమెరా కంట్రోల్‌, 48 మెగాపిక్సెల్‌ ఫ్యూజన్‌ కెమెరా వంటి ఫీచర్లతో కూడిన ఐఫోన్‌ 16 నాలుగు వేరియంట్ల(ఐఫోన్‌ 16, 16 ప్లస్‌, 16 ప్రో, 16 ప్రో మ్యాక్‌)లో లభించనుంది. దీని ప్రారంభ ధర 799 డాలర్లు. ఈ నెల 13 (శుక్రవారం) నుంచి ఐఫోన్లను బుక్‌ చేసుకోవచ్చని, 20వ తేదీ నుంచి విక్రయాలను ప్రారంభించనున్నట్లు యాపిల్‌ వెల్లడించింది. కంపెనీ కొత్త ఐఫోన్‌తోపాటు యాపిల్‌ వాచ్‌ 10 సిరీస్‌ను, ఎయిర్‌పాడ్స్‌ 4ను సైతం లాంచ్‌ చేసింది.

Updated Date - Sep 10 , 2024 | 12:07 PM