Anant-Radhika Wedding: అనంత్-రాధికల పెళ్లి ముహుర్తం ఎప్పుడు.. మొత్తం ఖర్చు ఎంతంటే..
ABN , Publish Date - Jul 12 , 2024 | 08:14 AM
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి(Anant-Radhika Wedding) వేడుక గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ రాయల్ వెడ్డింగ్‌కి ముఖేష్ అంబానీ ఎంత ఖర్చు చేస్తున్నారు. పెళ్లి ముహుర్తం ఎప్పుడనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి(Anant-Radhika Wedding) వేడుక గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట్లో మరికాసేపట్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లి జరగనుంది. అయితే ఈ రాయల్ వెడ్డింగ్‌కి ముఖేష్ అంబానీ ఎంత ఖర్చు చేస్తున్నారు. పెళ్లి ముహుర్తం ఎప్పుడనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లి ఖర్చు
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం మొత్తం వివాహ మహోత్సవం ఖర్చు(anant radhika wedding expenditure) రూ. 4,000-5,000 కోట్ల (0.6 బిలియన్ డాలర్లు) మధ్య ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇది అంబానీ కుటుంబ నికర విలువలో కేవలం 0.5 శాతం మాత్రమే కావడం విశేషం. అనంత్ మర్చంట్, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక మొత్తం ఖర్చు దాదాపు రూ. 1,000 కోట్లుగా అంచనా వేయబడింది. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకకు రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇది కాకుండా మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుక కోసం దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వేడుక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాలలో ఒకటిగా నిలువనుంది.
కార్డ్ ఖరీదు
అదే సమయంలో అంబానీ కుటుంబం పంపిన ఇన్విటేషన్ కార్డ్ ఖరీదు దాదాపు రూ.7 లక్షలు ఉంటుందని సమాచారం. వీరి పెళ్లికి 2500 మందికి పైగా ముఖ్యమైన అతిథులను ఆహ్వానించారు. అతిథులను తరలించేందుకు అంబానీ కుటుంబం మూడు ఫాల్కన్ 2000 జెట్‌లను అద్దెకు తీసుకున్నారు. దీంతోపాటు ఈ వేడుక కోసం 100 కంటే ఎక్కువ ప్రైవేట్ జెట్‌లను ఉపయోగిస్తున్నారు.
పెళ్లి ముహూర్తం
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల గ్రాండ్ పెళ్లి వేడుక కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఈ ప్రేమ జంట వివాహ వేడుకలు జూలై 12, 2024న మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలవుతాయి. బారాత్, సఫా టైయింగ్ వేడుక 3 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటలకు వరమాల వేడుక, ఆ తర్వాత వివాహ ముహూర్తం మొదలవుతుంది. ఆ క్రమంలో అనంత్, రాధిక లగ్న ముహూర్తం మేరకు రాత్రి 9:30 గంటలకు వివాహం జరగనుంది. దీని తరువాత జూలై 14, 2024న ఈ జంట మంగళ్ ఉత్సవ్ కార్యక్రమం, ఇదే వారి రిసెప్షన్. అనంత్, రాధికల వివాహ వేడుక జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతోంది.
ఇది కూడా చదవండి:
Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!
ఇంధన రంగంలో రూ.8.4 లక్షల కోట్ల పెట్టుబడి అవకాశాలు
భారత రియల్టీ మొఘల్ డీఎల్‌ఎఫ్ రాజీవ్ సింగ్
For Latest News and Business News click here