Apple: చైనాకు షాక్.. భారత్‌లో ఆపిల్ సేల్స్ గురించి సీఈఓ కీలక ప్రకటన
ABN , Publish Date - Nov 01 , 2024 | 01:41 PM
యాపిల్ కంపెనీ భారత్‌లో భారీ లాభాలను ఆర్జించి, రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో టిమ్ కుక్ స్వయంగా తెలిపారు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో దేశంలో మరో నాలుగు స్టోర్లను కూడా ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు.
ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్(apple) భారత్‌లో ఇటివల తయారు చేసి సేల్ చేసిన మోడళ్లకు రికార్డు స్థాయిలో వసూళ్లు లభించాయి. దీంతోపాటు జూలై-సెప్టెంబర్ 2024లో దేశంలో ఐప్యాడ్ విక్రయాలలో కూడా రెండంకెల వృద్ధి నమోదైంది. ఈ విషయాన్ని కంపెనీ సీనియర్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ క్రమంలో మొత్తం నికర అమ్మకాలు ఆరు శాతం కంటే ఎక్కువ పెరిగి 94.93 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయన్నారు. ఇది ఏడాది క్రితం 89.49 బిలియన్ డాలర్లుగా ఉందని కంపెనీ తెలిపింది.
సేల్స్ పట్ల సంతోషం
ఈ క్రమంలో కంపెనీ ఆదాయాల గురించి స్వయంగా ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) టిమ్ కుక్(Tim Cook) ప్రస్తావించారు. మేము అమెరికా, యూరప్ సహా భారత్‌పాటు అమెరికా, బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, బ్రిటన్, కొరియాలో విజయం సాధించామన్నారు. దీంతోపాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా అనేక దేశాలలో యాపిల్ సెప్టెంబర్ త్రైమాసిక ఆదాయ రికార్డులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆల్‌టైమ్ రికార్డ్ రెవెన్యూలను నమోదు చేసిన భారతదేశంలో వచ్చిన సేల్స్‌తో తాము చాలా సంతోషిస్తున్నట్లు చెప్పారు.
ఇక్కడే కొత్త స్టోర్లు
యాపిల్ దేశంలో ఇప్పటికే రెండు స్టోర్లను ప్రారంభించింది. ఒక స్టోర్ ముంబైలో, మరొకటి ఢిల్లీలో ఉంది. ఈ క్రమంలోనే భారతదేశంలో మరో నాలుగు కొత్త స్టోర్లను ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. భారతదేశంలో పూణె, బెంగళూరు, ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబయిలో అక్టోబరు ప్రారంభంలో మరో నాలుగు స్టోర్‌లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం సెప్టెంబర్ 2024 త్రైమాసికంలో భారతదేశంలో ఆపిల్ ఐఫోన్ అమ్మకాల వాటా 21.6 శాతంగా ఉంది. ఇది శామ్‌సంగ్ కంటే కొంచెం తక్కువ.
మొత్తం ఆదాయం
జూలై-సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో ఉత్పత్తి విక్రయాల ద్వారా Apple ఆదాయం 4.12 శాతం పెరిగి $69.95 బిలియన్లకు చేరుకుంది. ఈ సంవత్సరం ఇదే కాలంలో $67.18 బిలియన్లతో పోలిస్తే ఐఫోన్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన $43.8 బిలియన్ల నుంచి 5.5 శాతం పెరిగి $46.22 బిలియన్లకు చేరుకున్నాయి. ఐప్యాడ్స్ ద్వారా USలో $ 7 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూకా మేస్త్రి తెలిపారు. ఇది గత సంవత్సరం కంటే ఎనిమిది శాతం ఎక్కువ అన్నారు.
ఇక చైనాలో ఇలా..
ఈ క్రమంలోనే అభివృద్ధి చెందిన మార్కెట్లలో వృద్ధితో పాటు, మెక్సికో, బ్రెజిల్, మధ్యప్రాచ్యం, భారతదేశం, దక్షిణాసియాలో రెండంకెల వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు ఆపిల్ చైనాలో మాత్రం సవాళ్లను ఎదుర్కొంటోంది. స్థానిక బ్రాండ్ల పోటీ కారణంగా ఆదాయం తగ్గి $15 బిలియన్లకు చేరుకుంది. అక్కడి మార్కెట్‌లో iPhone అమ్మకాలు అనుకున్నంత స్థాయిలో ఉండటం లేదు. దీంతో యాపిల్ ఇప్పుడు భారత్‌పై ఫోకస్ చేసింది.
ఇవి కూడా చదవండి:
Bibek Debroy: పీఎం ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ బిబేక్ దేబ్రోయ్ కన్నుమూత
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
LPG Gas: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్
Read More Business News and Latest Telugu News