Billionaires Index: వరల్డ్ సూపర్ రిచ్ జాబితాలో అంబానీ, అదానీ..ఇంకా ఎవరెవరు ఉన్నారంటే
ABN , Publish Date - May 17 , 2024 | 02:40 PM
మనదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. తాజాగా ప్రపంచంలోని సూపర్ రిచ్ క్లబ్(worlds super rich club)లో 15 మంది సభ్యులు చోటు దక్కించుకోగా వారిలో ముఖేష్, అదానీ చేరారు. ముఖేష్ అంబానీ తర్వాత గౌతమ్ అదానీ మరోసారి 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరారు.
మనదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. తాజాగా ప్రపంచంలోని సూపర్ రిచ్ క్లబ్(worlds super rich club)లో 15 మంది సభ్యులు చోటు దక్కించుకోగా వారిలో ముఖేష్, అదానీ చేరారు. ముఖేష్ అంబానీ తర్వాత గౌతమ్ అదానీ(gautam Adani) మరోసారి 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరారు. ప్రపంచంలోని టాప్ 15 బిలియనీర్లలో 14 మంది నికర విలువ ఇప్పుడు 100 బిలియన్ డాలర్లకుపైగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్(Bloomberg Billionaires Index) ప్రకారం ప్రస్తుతం బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్ మాత్రమే 200 బిలియన్ డాలర్ల క్లబ్‌లో ఉన్నారు.
బెర్నార్డ్ ఆర్నాల్ట్(bernard arnault) ఆస్తుల విలువ 221 బిలియన్ డాలర్లు కాగా, జెఫ్ బెజోస్(jeff bezos) ఆస్తుల విలువ 206 బిలియన్ డాలర్లుగా ఉంది. తర్వాతి స్థానంలో 188 బిలియన్ డాలర్ల నికర విలువతో ఎలాన్ మస్క్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక మెటా యజమాని మార్క్ జుకర్‌బర్గ్ 168 బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు. లారీ పేజ్ 155 బిలియన్ డాలర్లతో ఐదో స్థానం, బిల్ గేట్స్ 154 బిలియన్ డాలర్లతో ఆరో స్థానం దక్కించుకున్నారు.
ఇక సెర్గీ బ్రిన్ 146 బిలియన్ డాలర్ల విలువతో ఏడో స్థానంలో ఉండగా, స్టీవ్ బాల్మెర్ 146 బిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానం దక్కించుకున్నారు. వారెన్ బఫెట్ నికర సంపద 137 బిలియన్ డాలర్లతో 9వ స్థానంలో ఉండగా, లారీ ఎల్లిసన్ 137 బిలియన్ డాలర్లతో 10వ స్థానంలో కలరు.
ఇక 109 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన ముఖేష్ అంబానీ(mukesh ambani) 12వ స్థానంలో ఉండగా, గౌతమ్ అదానీ(gautam Adani) 100 బిలియన్ డాలర్ల ఆస్తులు కలిగి 14వ స్థానంలో ఉన్నారు. టాప్ 15 బిలియనీర్లలో దాదాపు అందరూ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరారు. ఇందులో విశేషమేమిటంటే టాప్ 10 బిలియనీర్లలో 8 మంది టెక్ వ్యాపారంలో ఉండటం విశేషం.
ఇది కూడా చదవండి:
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
SEBI: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు శుభవార్త.. ఆ రూల్స్ సడలించిన సెబీ
Read Latest Business News and Telugu News