Share News

Dhana Trayodashi: బంగారం లేదా వెండి.. ధన త్రయోదశి రోజు ఏది కొంటే మంచిది..

ABN , Publish Date - Oct 25 , 2024 | 04:43 PM

ధన త్రయోదశి రోజు బంగారం కొంటే మేలా, వెండి కొంటే బెస్టా..

Dhana Trayodashi: బంగారం లేదా వెండి.. ధన త్రయోదశి రోజు ఏది కొంటే మంచిది..
Dhana Trayodashi

భారతదేశ హిందూ క్యాలెండర్లో చాలా తిథులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ధన త్రయోదశి రోజు ఆయుర్వేదానికి మూల పురుషుడు అయిన ధన్వంతరి భూమి మీద ఉద్భవించాడని చెబుతారు. ఆయుర్వేదంలో ప్రతి వైద్యుడు ఔషధాన్ని ఇచ్చేముందు ధన్వంతరిని స్మరించుకునే రోగులకు ఇస్తుంటారు కూడా. అయితే చాలామందికి ధన త్రయోదశి రోజు బంగారం లేదా వెండి, లేదా మరింకేదైనా విలువైన వస్తువులు కొనడం అలవాటుగా ఉంటుంది. ఎక్కువ మంది బంగారం లేదా వెండి వైపు మొగ్గు చూపుతారు. ఈ రెండింటిలో ఏది కొంటే మంచిది తెలుసుకుంటే..

బంగారం..

  • భారతీయులు బంగారాన్ని విలువైన లోహం గానే కాకుండా సంపదకు, సమాజంలో గౌరవానికి చిహ్నంగా భావిస్తారు. ఆభరణాలు, నాణేలు, దేవతా మూర్తి విగ్రహాలు మొదలైనవి బంగారంతో చేసినవి చాలామంది వినియోగిస్తుంటారు.

  • ఆర్థిక కోణంలో చూస్తే బంగారాన్ని కొనడం అంటే మంచి మార్గంలో పెట్టుబడి పెట్టడమే. బంగారానికి ఎప్పుడూ విలువ ఉంటుందని అంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొనడం వల్ల చాలామంది బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు.

  • బంగారాన్ని ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయడం, తిరిగి విక్రయించడం సులభం. ఆర్థిక మాంద్యం సమయాలలో బంగారం ధరలు సానుకూలంగా పెరుగుతుంటాయి.

  • బంగారం రేట్లు మరింత పెరగడం లేదా స్థిరంగా ఉండటం జరుగుతుందే తప్ప తగ్గడం అంటూ ఉండదట. కాబట్టి ఆసక్తి ఉన్నవారు బంగారం కొనడం మేలట.

Health Tips: శరీరంలో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది.. కొలెస్ట్రాల్ ఎంత ఉంటే సేఫ్ గా పరిగణిస్తారంటే..


వెండి..

  • బంగారం తో పోలిస్తే వెండి ధర తక్కువ. డబ్బులు ఎక్కువగా లేకపోయినా వెండిని కొనుగోలు చేయవచ్చు.

  • సిల్వర్ ను ఎలక్ట్రానిక్స్ , సోలార్ ప్యానెల్స్ తో పాటు చాలా వైద్య పరికరాలలో కూడా ఉపయోగిస్తుంటారు. వెండికి డిమాండ్ పెరగడానికి ఇది కూడా కారణం. కాబట్టి వెండి కూడా క్రమంగా రేటు పెరుగుతూ ఉంటుంది. వెండి కొనుగోలులో కూడా పెట్టుబడి పెట్టడం మంచిదే.

  • బుల్ మార్కెట్లలో వెండి ధర వేగంగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ బాగున్న సమయంలో వెండి ధరలు స్పైక్ లో ఉండవచ్చు.

Vitamin-D: విటమిన్-డి సప్లిమెంట్లను రోజూ తీసుకున్నా కొందరికి పనిచేయవు ఎందుకని..


ప్రయోజనం..

  • బంగారం, వెండి కేవలం కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టడం గానే కాకుండా వస్తు రూపంగా కూడా చేతిలో ఉంటాయి. ఆర్థిక వృద్దిని దృష్టిలో ఉంచుకుని బంగారం, వెండిని కొనుగోలు చేయడం మంచిది.

  • బంగారాన్ని కొంటే ఎక్కువ కాలం స్థిరంగా ఉన్న పెట్టుబడులు పెట్టినవారు అవుతారట.

  • వెండిని కొంటే ఎక్కువ ఖర్చు లేకుండా మంచి మార్గంలో పెట్టుబడి పెట్టినట్టు అని అంటున్నారు.

  • కాబట్టి ధన త్రయోదశి రోజు బంగారం, వెండి లను ఆర్థిక పరిస్థితిని బట్టి కొనుగోలు చేయడం మంచిది.

ఇవి కూడా చదవండి..

Skin Care: నారింజ తొక్కలు ఇలా వాడితే.. మచ్చలు లేని చర్మం గ్యారెంటీ..

Ghee Coffee: నెయ్యి కాఫీ బరువు తగ్గడంలో నిజంగా సహాయపడుతుందా..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 25 , 2024 | 04:43 PM