Gold and Silver Rate Updates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. ఎంతకు చేరాయంటే..
ABN , Publish Date - Aug 12 , 2024 | 06:28 AM
దేశంలో గత కొద్ది రోజులుగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు నేడు(ఆగస్టు 12న) మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే అంతర్జాతీయంగా కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల నేపథ్యంలో ఇవి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో గత కొద్ది రోజులుగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు నేడు(ఆగస్టు 12న) మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే అంతర్జాతీయంగా కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల నేపథ్యంలో ఇవి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు హైదరాబాద్, విజయవాడలో ఉదయం 6.20 నిమిషాల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర స్వల్పంగా 10 రూపాయలు తగ్గి రూ. 70,300కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64,440కి చేరింది.
మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 70,450కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,590గా ఉంది. ఇక వెండి రేట్ల గురించి మాట్లడితే ఇవి కూడా కిలోకు 100 రూపాయలు తగ్గుముఖం పట్టాయి. దీంతో కేజీ వెండి ధర రూ.83000కు చేరుకుంది. ఈ క్రమంలో దేశంలోని కీలక నగరాల్లో ప్రస్తుతం ఉన్న బంగారం, వెండి రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)
ఢిల్లీలో రూ.70,450, రూ. 4,590
హైదరాబాద్‌లో రూ. 70,300, రూ. 64,440
విజయవాడలో రూ. 70,300, రూ. 64,440
చెన్నైలో రూ. 70,300, రూ. 64,440
ముంబైలో రూ. 70,300, రూ. 64,440
బెంగళూరులో రూ. 70,300, రూ. 64,440
కోల్‌కతాలో రూ. 70,300, రూ. 64,440
అయోధ్యలో రూ. 70,450, రూ. 64,590
కేరళలో రూ. 70,300, రూ. 64,440
దేశంలో ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
బెంగళూరులో రూ. 80,550
హైదరాబాద్‌లో రూ. 88,000
విజయవాడలో రూ. 88,000
ఢిల్లీలో రూ. 83,000
చెన్నైలో రూ. 88,000
గోవాలో రూ. 80,550
కేరళలో రూ. 88,000
వారణాసిలో రూ. 83,000
ఆగ్రాలో రూ.83,000
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ ప్రపంచ మార్కెట్‌లో ధోరణుల నేపథ్యంలో మారుతుంటాయి. కాబట్టి ఇవి తీసుకునే విషయంలో మళ్లీ రేట్ల గురించి తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News