Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Nov 11 , 2024 | 07:09 AM
ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం దీపావళి పండుగ తర్వాత కాస్త స్థిరీకరణకు గురవుతోంది. దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి.
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం దీపావళి పండుగ తర్వాత కాస్త స్థిరీకరణకు గురవుతోంది. దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 11న) ఉదయం 7.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 79, 350కి చేరింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 79, 500కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 72, 890కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 350కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72, 740కి చేరింది. వెండి ధరలు కేజీకి వంద రూపాయలు తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్లో రూ. 79, 350, రూ. 72, 740
విజయవాడలో రూ. 79, 350, రూ. 72, 740
ఢిల్లీలో రూ. 79, 500, రూ. 72, 890
ముంబైలో రూ. 79, 350, రూ. 72, 740
వడోదరలో రూ. 79, 400, రూ. 72, 790
కోల్కతాలో రూ. 79, 350, రూ. 72, 740
చెన్నైలో రూ. 79, 350, రూ. 72, 740
బెంగళూరులో రూ. 79, 350, రూ. 72, 740
కేరళలో రూ. 80, 230, రూ. 73, 540
పుణెలో రూ.79, 350, రూ. 72, 740
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్లో రూ. 1,02,900
విజయవాడలో రూ. 1, 02, 900
ఢిల్లీలో రూ. 93, 900
చెన్నైలో రూ. 1, 02, 900
కోల్కతాలో రూ. 93, 900
కేరళలో రూ. 1, 02, 900
ముంబైలో రూ. 93, 900
బెంగళూరులో రూ. 93, 900
భువనేశ్వర్లో రూ. 1, 02, 900
వడోదరలో రూ. 93, 900
అహ్మదాబాద్లో రూ. 93, 900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..