Share News

SIP: ఎస్‌ఐపీ.. నెలకు రూ.11,111 చొప్పున జస్ట్ 15 ఏళ్లు పెట్టుబడి పెడితే..

ABN , Publish Date - Dec 30 , 2024 | 02:21 PM

నెలకు ఏయే మొత్తాలు వివిధ గడువుల మేరకు పెట్టుబడి పెడితే లాభం ఎంత వస్తుందో ఈ కథనంలో సవివంగా తెలుసుకుందాం.

SIP: ఎస్‌ఐపీ.. నెలకు రూ.11,111 చొప్పున జస్ట్ 15 ఏళ్లు పెట్టుబడి పెడితే..

ఇంటర్నెట్ డెస్క్: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునేవారి ముందున్న సులభమైన మార్గం క్రమానుగత పెట్టుబడులు.. అంటే సిస్టమాటిక్ ఇన్వెస్టిమెంట్ ప్లాన్ (ఎస్ఐపీ). నెల నెలా ఖర్చులు పోను మిగిలే సొమ్మును ఇన్వెస్టర్టు ఎస్‌ఐపీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించవచ్చు. దీంతో, ఒకేసారి భారీ మొత్తాలు తీయాల్సిన అగత్యం తప్పుతుంది. కాంపౌండింగ్ కారణంగా పెట్టుబడులు తరువాతి కాలంలో మంచి రాబడులను అందిస్తాయి. మరి నెలకు ఏయే మొత్తాల పెట్టుబడితో ఏ మేరకు లాభాలు వస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం (Personal Finance).

మీరు నెలకు రూ.11,111 చొప్పున ఎస్‌ఐపీల్లో 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. దీంతో, మీ డబ్బు మొత్తం (కార్పస్) రూ.56.06 లక్షలకు చేరుకుంటుంది. ఇందులో సుమారు రూ.20 లక్షలు పెట్టుబడి కాగా ఆపై మొత్తం లాభంగా చేకూరుతుందన్నమాట.

Bank Holidays 2025: జనవరి 2025లో బ్యాంక్ సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే


ఇక నెలకు రూ.22,222 చొప్పు 10 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే ఆ తరువాత మొత్తం సొమ్ము రూ.51.63 లక్షలకు చేరుతుందన్నమాట. ఇందులో లాభం రూ.24.94 లక్షలు

నెలకు రూ.33,333 చొప్పున 7 ఏల్ల పాటు ఎస్‌ఐపీలో ఇన్వెస్ట్ చేస్తే మొత్తం సొమ్ము రూ.43.99 లక్షలకు చేరుకుంటుంది. ఇందులో అసలు రూ.28 లక్షలు కాగా మిగిలిన రూ.15.99 లక్షలు రాబడి. దీన్ని బట్టి ఎస్‌ఐపీల్లో కాంపౌండింగ్‌కు ఉన్న శక్తి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

IRCTC: రైల్వే టికెట్ యూజర్లకు షాకిచ్చిన ఐఆర్‌సీటీసీ.. కానీ ఇప్పుడు


ఒక్క ముక్కలో చెప్పాలంటే కాంపౌండింగ్ అంటే వడ్డీప వడ్డీ రాబడిగా అందడం. అంటే.. అసలుకు కొంత వడ్డీ జతకూడాక ఈ మొత్తంపై మళ్లీ వడ్డీ రావడం. ఇలా కాలం గడిచేకొద్దీ లాభం పెరిగినట్టు అవుతుంది. ఎస్‌ఐపీ విధానంలో ఒకేసారి భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం ఉండదు. దీంతో, శాలరీలు తీసుకునే వారికి అత్యంత ఉపయుక్తమైన పెట్టుబడి సాధనమని నిపుణులు చెబుతున్నారు. అయితే, స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, అందుకు అనువైన ఎస్‌ఐపీ పథకాలను ఎంచుకుని పెట్టుబడి పెట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, ఎస్‌ఐపీ మొదలెట్టాక నెల నెలా క్రమం తప్పకుండా డబ్బులు కట్టకపోతే రాబడిపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.


2025లో జోరుగా విదేశీ పెట్టుబడులు!

Read Latest and Business News

Updated Date - Dec 30 , 2024 | 02:51 PM