Jeff Bezos: ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టి జెఫ్ బెజోస్ అగ్రస్థానం
ABN , Publish Date - Mar 05 , 2024 | 11:35 AM
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(jeff bezos) మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. దీంతో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ రెండో స్థానానికి చేరుకున్నారు.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(jeff bezos) మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి(World Richest Person)గా నిలిచారు. దీంతో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ రెండో స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్(elon musk) తొమ్మిది నెలల పాటు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.
మార్చి 4న టెస్లా షేర్లలో 7.2% పతనం తర్వాత ఈ మార్పు కనిపించింది. ఇప్పుడు ఎలాన్ మస్క్ నికర విలువ 197.7 బిలియన్ డాలర్లు కాగా, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 200.3 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానానికి చేరుకున్నారు.
2021 తర్వాత బ్లూమ్‌బెర్గ్ ర్యాంకింగ్స్‌లో బెజోస్(jeff bezos) తిరిగి అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఒకప్పుడు 142 బిలియన్ డాలర్లుగా ఉన్న రెండు టెక్ దిగ్గజాల మధ్య సంపద అంతరం, స్టాక్ ట్రెండ్‌ల నేపథ్యంలో గణనీయంగా మార్పులు వచ్చాయి. అమెజాన్ షేర్లు 2022 చివరి నుంచి రెట్టింపు కంటే ఎక్కువ విలువను కలిగి ఉన్నాయి.
మరోవైపు టెస్లా షేర్ ధర 2021 గరిష్ట స్థాయితో పోలిస్తే దాదాపు 50 శాతం క్షీణించింది. షాంఘై ఫ్యాక్టరీ నుంచి షిప్‌మెంట్లలో క్షీణత కారణంగా ఈ సంవత్సరంలో టెస్లా షేరు(tesla shares) ధరలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారి రోజుల నుంచి అమెజాన్ తన ఆన్‌లైన్ అమ్మకాల వృద్ధిని మరింత పెంచుకుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Elon Musk: ఎలాన్ మస్క్‌పై వెయ్యి కోట్ల దావా వేసిన నలుగురు..అసలేమైంది?