E-Bike: రూ.57 వేలకే ప్రముఖ ఈ బైక్.. ఆఫర్, సబ్సిడీ గురించి తెలుసా
ABN , Publish Date - Apr 30 , 2024 | 11:45 AM
ప్రస్తుత రోజుల్లో మీరు డబ్బు ఆదా చేసుకోవడానికి కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా. అయితే మీరు ఈ వార్తపై ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు పెట్రోల్ వాహానానికి బదులు ఈ బైక్(Electric Two Wheeler) తీసుకుంటే డబ్బు ఆదా చేసుకోవడంతోపాటు పర్యావరణానికి కూడా మేలు చేసినవారు అవుతారు. అయితే ప్రస్తుతం తక్కువ ధరల్లో ఉన్న ఈ బైక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత రోజుల్లో మీరు డబ్బు ఆదా చేసుకోవడానికి కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా. అయితే మీరు ఈ వార్తపై ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు పెట్రోల్ వాహానానికి బదులు ఈ బైక్(Electric Two Wheeler) తీసుకుంటే డబ్బు ఆదా చేసుకోవడంతోపాటు పర్యావరణానికి కూడా మేలు చేసినవారు అవుతారు. అయితే ప్రస్తుతం తక్కువ ధరల్లో ఉన్న ఈ బైక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో ఒకటి ఓలా s1x బైక్. దీని అసలు ధర రూ. 79,999 కాగా, ప్రస్తుతం రూ. 69,999కే లభిస్తుంది.
ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌కైనా పరిధి చాలా ముఖ్యం. ఎందుకంటే దీనిని ఒకసారి ఛార్జింగ్ చేసిన తర్వాత ఎక్కువ దూరం ప్రయాణించాలని ప్రజలు కోరుకుంటారు. Ola S1X విషయానికి వస్తే ఇది 4kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 190KM వరకు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 90 కిమీ/గం వేగాన్ని అందజేస్తుందని, కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 40కిమీ వేగాన్ని అందుకోగలదని తెలిపారు. ఈ స్కూటర్‌లో 34 లీటర్ల బూట్ స్పేస్, 5 అంగుళాల ప్రత్యేక డిస్‌ప్లే సహా అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.
కస్టమర్లు Ola S1Xని మొత్తం ఏడు విభిన్న రంగు ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో రెడ్ వెలాసిటీ, మిడ్‌నైట్, వోగ్, స్టెల్లార్, ఫంక్, పోర్సిలైన్ వైట్, లిక్విడ్ సిల్వర్ వంటి రంగులు ఉన్నాయి. అంతేకాదు ఎలక్ట్రిక్ వెహికల్స్ - II (FAME-II) పథకం ద్వారా EV అమ్మకాలలో వృద్ధిని కొనసాగించడం ఈ పథకం లక్ష్యం. రూ.500 కోట్ల కేటాయింపుతో కొత్త పథకం ఏప్రిల్ 1న ప్రారంభమై జూలై 31 వరకు ఉంటుందని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈవీ(EV) వాహనాలపై మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ సబ్సిడీని ఈ బైక్‌పై తీసేయడం ద్వారా 57 వేల రూపాయలకే పొందవచ్చు. అయితే ఈ బైక్ కొనుగోలు చేసే ముందు ఈ ఆఫర్ ఉందో లేదో తెలుసుకుని కొనుగోలు చేయండి.
ఇది కూడా చదవండి:
తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా
Read Latest Business News and Telugu News