Share News

Reliance JIO: జియో బంపరాఫర్.. అతి తక్కువ ధరలో 44 జీబీ డేటా

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:54 PM

యూజర్లకు రిలయన్స్ జియో(Reliance JIO) గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కంపెనీ ప్రకటించిన ఓ ఆఫర్ ఎక్కువ డేటా కావానుకుంటున్న వారికి ఉపయోగపడనుంది. ఇప్పటికే ఆకర్షణీయమైన ఆఫర్లు, కొత్త రీఛార్జ్ ప్లాన్ లతో జియో ఆకట్టుకుంటోంది.

Reliance JIO: జియో బంపరాఫర్.. అతి తక్కువ ధరలో 44 జీబీ డేటా

ఢిల్లీ: యూజర్లకు రిలయన్స్ జియో(Reliance JIO) గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కంపెనీ ప్రకటించిన ఓ ఆఫర్ ఎక్కువ డేటా కావానుకుంటున్న వారికి ఉపయోగపడనుంది. ఇప్పటికే ఆకర్షణీయమైన ఆఫర్లు, కొత్త రీఛార్జ్ ప్లాన్ లతో జియో ఆకట్టుకుంటోంది. తాజాగా తీసుకొచ్చిన ఆఫర్ లో తక్కువ ధరకే అధిక జీబీ(Mobile Data) డేటాను యూజర్లు పొందవచ్చు. Data Intensive Activities లో భాగంగా యూజర్స్ కోసం జియో కేవలం రూ.219తోనే ప్రీపెయిడ్ ప్లాన్ పరిచయం చేసింది.


ఈ ప్లాన్ అధిక డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ఇంటర్నెట్ ఎక్కువ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. తాజా ప్లాన్ తో 14 రోజులపాటు యూజర్లు ఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ తో పాటు, 100 ఎస్ఎంఎస్ లను పొందొచ్చు. దీనితోపాటు 42 జీబీ డేటా వాడుకోవచ్చు. ప్రతి రోజూ 3 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. దానితోపాటు 2 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. మొత్తంగా 44 జీబీ డేటాను అన్ లిమిటెడ్ గా 14 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చన్నమాట. వీటితోపాటు జియో క్లౌడ్, టీవీ, సినిమా యాప్ లకు కూడా యాక్సెస్ ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Jan 14 , 2024 | 01:57 PM