Rs 2000 Notes: ఇప్పటికీ ప్రజల దగ్గరే రూ.6970 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ కీలక ప్రకటన..
ABN , Publish Date - Nov 05 , 2024 | 11:59 AM
గతేడాది మే 19వ తేదీన ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అప్పటికి చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల విలువ ఏకంగా రూ. 3.56 లక్షల కోట్లు. ఆ ప్రకటన తర్వాత ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం లేదా తమ ఖాతాల్లో జమ చేసుకోవడం వంటివి చేశారు.
నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) రూ.2 వేల నోట్లను (Rs 2000 Notes) ముద్రించి చెలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది మే 19వ తేదీన ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అప్పటికి చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల విలువ ఏకంగా రూ. 3.56 లక్షల కోట్లు. ఆ ప్రకటన తర్వాత ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం లేదా తమ ఖాతాల్లో జమ చేసుకోవడం వంటివి చేశారు. అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా రూ.2 వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంది.
అన్ని బ్యాంకుల్లో ఈ నోట్లను ఎక్స్చేంజ్ చేసుకునేందుకు 2023, అక్టోబర్ 7 వరకు అవకాశం కల్పించింది. క్రమంగా రూ.2 వేల నోట్లను తిరిగి వెనక్కి రప్పించింది. నాటి నుంచి ఇప్పటి వరకూ 98.04 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని సోమవారం ఆర్బీఐ వెల్లడించింది. అంటే గత నెల 31 నాటికి దేశంలో ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.6,970 కోట్లు. 2023 అక్టోబర్ ఏడో తేదీ వరకూ అన్ని బ్యాంకుల శాఖల వద్ద రూ.2000 నోట్ల డిపాజిట్లకు అనుమతించారు. 2023 అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల వద్ద మాత్రమే రూ.2000 నోట్ల మార్పిడికి అనుమతి ఉంది.
2016 నవంబరు నెలలో అప్పటికి చలామణీలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రూ. 2 వేల విలువైన పెద్ద నోటును ప్రవేశపెట్టింది. గతేడాది ఆ రెండు వేల నోటును ఉపసంహరించుకుంది. రూ. 2 వేల ఉపసంహరించుకున్నప్పటికీ రద్దు మాత్రం చేయలేదు. అయితే వాటిని బయటి మార్కెట్లలోనూ, బ్యాంక్‌ల్లోనూ తీసుకోవడం లేదు. దీంతో త్వరలోనే మొత్తం రెండు వేల నోట్లు వెనక్కి వచ్చేస్తాయని ఆర్బీఐ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి..
Stock Market: మూడు నెలల కనిష్టానికి సెన్సెక్స్.. కొనసాగుతున్న నష్టాలు..
Bank lockers: బ్యాంక్ లాకర్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కట్టాల్సిన మొత్తం ఎంతంటే..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..