Share News

Stock Market: సెన్సెక్స్ @ 85 వేలు, 26 వేలకు పైన నిఫ్టీ.. సరికొత్త ఎత్తులకు దేశీయ సూచీలు..

ABN , Publish Date - Sep 25 , 2024 | 04:06 PM

వరుసగా లాభాలు అందుకుంటూ దూసుకుపోతున్న దేశీయ సూచీలు రికార్డుల దిశగా పయనం సాగించాయి. అంతర్జాతీయంగా పలు సానుకూల సంకేతాలు నెలకొనడం కలిసొచ్చింది. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఆ ప్రభావంతో ఈ రోజు ఆసియా సూచీలు లాభాల బాట పట్టాయి.

Stock Market: సెన్సెక్స్ @ 85 వేలు, 26 వేలకు పైన నిఫ్టీ.. సరికొత్త ఎత్తులకు దేశీయ సూచీలు..
Stock Market

అంతర్జాతీయంగా పలు సానుకూల సంకేతాలు నెలకొనడం కలిసొచ్చింది. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఆ ప్రభావంతో ఈ రోజు ఆసియా సూచీలు లాభాల బాట పట్టాయి. దేశీయ సూచీలు ఆరంభంలో కాస్త ఒడిదుడుకులకు లోనైనప్పటికీ తర్వాత కోలుకుని లాభాల జోరు చూపించాయి. సెన్సెక్స్ 85 వేల పైన క్లోజ్ అయింది. నిఫ్టీ 26 వేలకు పైన రోజును ముగించింది. (Business News).


మంగళవారం ముగింపు (84, 914)తో పోల్చుకుంటే దాదాపు వంద పాయింట్ల నష్టంత5 84, 836 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత 84, 743 వద్ద ఇంట్రాడే లోకి చేరుకుంది. ఆ తర్వాత లాభాల బాట పట్టింది. ఇంట్రాడే కనిష్టం నుంచి 500 పాయింట్లు ఎగబాకి 85, 247 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివకు 255 పాయింట్ల లాభంతో 85, 169 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. దాదాపు 85 పాయింట్ల నష్టంతో రోజును ప్రారంభించింది. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. చివరకు 63.75 పాయింట్ల లాభంతో 26, 004 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో టాటా కమ్యూనికేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గోద్రేజ్ ప్రాపర్టీస్, అపోలో టైర్స్ షేర్ల లాభాలు సంపాదించాయి. డాబర్ ఇండియా, ఐఈఎక్స్, ఒరాకిల్ ఫిన్‌సెర్స్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 365 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 133 పాయింట్లు లాభపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.59గా ఉంది.

Updated Date - Sep 25 , 2024 | 04:06 PM