Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు!
ABN , Publish Date - May 06 , 2024 | 04:24 PM
రోజంతా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్ప లాభాలను అందుకుంది. నిఫ్టీ స్వల్పంగా నష్టపోయింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాలు, ప్రీ-ఎలక్షన్ ర్యాలీతో సోమవారం ఉదయం సెన్సెక్స్ లాభాలతో ప్రారంభమైంది.
రోజంతా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్ప లాభాలను అందుకుంది. నిఫ్టీ స్వల్పంగా నష్టపోయింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాలు, ప్రీ-ఎలక్షన్ ర్యాలీతో సోమవారం ఉదయం సెన్సెక్స్ లాభాలతో ప్రారంభమైంది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు మొదలు కావడంతో సూచీలు లాభ, నష్టాలతో దోబూచులాడాయి(Business News).
సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ దశలో 74,359 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరుకుంది. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుని 73,786 వద్ద కనిష్టానికి చేరుకుంది. చివరకు 17 పాయింట్ల స్వల్ప లాభంతో 73,895 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 22,442 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 272 పాయింట్లు కోల్పోయింది.
సెన్సెక్స్‌లో ప్రధానంగా గోద్రేజ్ ప్రాపర్టీస్, బ్రిటానియా, కొటక్ మహీంద్రా బ్యాంక్, అల్కెమ్ లాబోరేటరీస్ లాభాలను ఆర్జించాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్‌ఈసీ, టైటాన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.50గా ఉంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఢిల్లీలో ఫాస్ట్ ఫుడ్ అమ్ముతున్న పదేళ్ల బాలుడు.. ఆ బాలుడి కథ వింటే కన్నీళ్లు ఆగవు..!
Viral Video: ఇరాన్‌లో చేపల వర్షం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో.. దీని వెనుకున్న కారణమేంటి?
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..