Narendra Modi: యూట్యూబ్ ఛానెల్ ద్వారా మోదీకి ఒకే వీడియోకు కోటికిపైగా ఆదాయం..
ABN , Publish Date - Mar 30 , 2025 | 09:33 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మోదీ ఒక్క వీడియోతోనే ఏకంగా కోటి రూపాయలకుపైగా సంపాదించారు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అకౌంట్లను ఫాలో అయ్యే వారు కోట్లలో ఉన్నారు. ఆయన నాయకత్వం, ఆలోచనలు, చర్చల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రజలతో కనెక్ట్ అవుతూ, వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందిస్తారు. ఇదే సమయంలో ప్రధాని మోదీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా మంచి ఫాలోవర్లను దక్కించుకుంది.
ఈ క్రమంలో మోదీ యూట్యూబ్ ఛానెల్‌ను ఏకంగా 2.74 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఇదే సమయంలో మోదీ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఒక్క వీడియోతోనే ఏకంగా కోటి రూపాయలకుపైగా సంపాదించారు. అవును మీరు చదివింది నిజమే. ఎలాగంటే ఇటీవల మార్చి 2న వనతారా వన్యప్రాణుల రక్షణ, పునరావాస కేంద్రాన్ని మోదీ సందర్శించారు. దాదాపు 3,000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న వంటారా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జామ్‌నగర్ శుద్ధి కర్మాగారంలో ఏర్పాటు చేశారు. ఇది ఏనుగులు సహా పలు రకాల వన్యప్రాణుల సంక్షేమం కోసం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్లో వనతార ప్రాజెక్టును సందర్శించిన వీడియోను అప్లోడ్ చేశారు. దీంతో ఇప్పటివరకు ఆ వీడియో దాదాపు 50.4 కోట్ల మంది వీక్షించారు. అంటే ఈ ఒక్క వీడియో ద్వారనే ప్రధాని మోదీ కోటి రూపాయలకు పైగా సంపాదించారని చెప్పవచ్చు. ప్రధాని మోదీ ఛానల్ బ్లాగ్ కేటగిరీ ఛానల్. దీనిలో దాదాపు 4 నుంచి 5 వేల వీక్షణలపై ఒక డాలర్ ఆదాయం వస్తుంది. ఆ విధంగా చూస్తే, ఈ వీడియో దాదాపు 126000 డాలర్లు సంపాదించింది. వీటిని మన భారతీయ రూపాయల్లోకి చూస్తే అది రూ. 1,07,80,396.20 అవుతుంది. ఈ విధంగా మోదీ ఒక్క వీడియో ద్వారా కోటి రూపాయలు సంపాదించారు.
ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆన్‌లైన్ సోషల్ మీడియా ద్వారా ఆయన స్థాయిని ఎలా పెంచుకున్నారో కూడా ఇది చూపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులు, అభిమానులు, రాజకీయ వర్గాలు, సంస్థలు, ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆయనను అనుసరిస్తూ సమాచారం తెలుసుకోవడంతోపాటు వారి ఆలోచనలు పంచుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Upcoming IPOs: ఇన్వెస్టర్లకు అలర్ట్..వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Read More Business News and Latest Telugu News

కొత్త ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా గురించి తెలుసా..

శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా

ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన 7 ప్రధాన బ్యాంకింగ్ రూల్స్

ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
