Share News

Worst Airline: ఈ ఎయిర్‌లైన్ వరస్ట్..ప్రయాణించే ముందు 100 సార్లు ఆలోచించాలన్న నటి

ABN , Publish Date - Jan 14 , 2024 | 05:15 PM

నాగిన్ 5 ఫేమ్, టీవీ నటి సుర్భి చందనా(Surbhi Chandna) సోషల్ మీడియాలో ఓ ప్రముఖ విమానయాన సంస్థపై విమర్శలు గుప్పించింది. ఎందుకంటే ఆ ఎయిర్‌లైన్‌తో తనకు చాలా చేధు అనుభవం ఎదురైనట్లు చెప్పింది.

Worst Airline: ఈ ఎయిర్‌లైన్ వరస్ట్..ప్రయాణించే ముందు 100 సార్లు ఆలోచించాలన్న నటి

నాగిన్ 5 ఫేమ్, టీవీ నటి సుర్భి చందనా(Surbhi Chandna) సోషల్ మీడియాలో ఓ ప్రముఖ విమానయాన సంస్థపై విమర్శలు గుప్పించింది. ఎందుకంటే ఆ ఎయిర్‌లైన్‌తో తనకు చాలా చేధు అనుభవం ఎదురైనట్లు చెప్పింది. అంతేకాదు ఆ విమానయాన సంస్థ ఫైట్లలో ప్రయాణించే ముందు 100 సార్లు ఆలోచించాలని చెప్పింది. అయితే ఈ భామ ఎందుకు అలా చెప్పిందో ఇఫ్పుడు చుద్దాం. అయితే తనకు జరిగిన అనుభవం గురించి నటి సోషల్ మీడియాలో 'విస్తారా'ను 'చెత్త విమానయాన సంస్థ' అని పేర్కొంది. అయితే ఆమె ట్వీట్ తర్వాత ఎయిర్‌లైన్ ఆమెకు క్షమాపణలు కూడా చెప్పింది. అసలు ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: దోశ వేసిన రామ్‌చ‌ర‌ణ్‌.. మెగాస్టార్ ఇంట అంబ‌రాన్నంటిన సంక్రాంతి సంబురాలు

ఈ విమానయాన సంస్థ నటి బ్యాగ్‌ను పోగొట్టింది. ముంబయి(mumbai) విమానాశ్రయంలో గ్రౌండ్ స్టాఫ్ తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. ఆ తర్వాత ఆమె చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ క్రమంలో సిబ్బంది నటికి సహాయం చేయడానికి నిరాకరించారు. ఆ తర్వాత సురభి చందనా తన ట్విట్టర్ ఖాతా (X)లో ఇలా రాసింది. చెత్త విమానయాన సంస్థల్లో విస్తారాకు అవార్డు దక్కుతుందని తెలిపింది. వారు తన ఒక రోజు సమయాన్ని వృథా చేశారని చెప్పింది. బ్యాగ్ సమయానికి తన తల్లికి చేరుకుందా లేదా అని ఇప్పటికీ హామీ ఇవ్వలేదని చెప్పింది. అసమర్థ సిబ్బంది తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని వెల్లడించింది.

ఈ బ్యాడ్ ఎయిర్‌లైన్‌తో ప్రయాణించే ముందు 100 సార్లు ఆలోచించాలని సురభి అభిమానులకు(fans) సలహా ఇచ్చింది. ఈ సిబ్బంది వైఖరి చాలా అసభ్యంగా ఉందని వెల్లడించింది. తన బ్యాగ్ ఎప్పుడు వస్తుందో తనకు తెలియదని దాని గురించి తాను ఏమీ చేయలేనని నేరుగా నటితో సిబ్బంది చెప్పినట్లు సురభి వెల్లడించింది. ఈ క్రమంలో పలువురు అభిమానులు కూడా నటికి మద్దతుగా నిలిచారు.

Updated Date - Jan 14 , 2024 | 05:17 PM