Hyderabad: కుల దైవానికి మొక్కి.. చోరీల వేటకు..
ABN , Publish Date - Oct 09 , 2024 | 08:40 AM
శివారు ప్రాంతాల్లో తిష్టవేసి, ఖరీదైన ఇళ్లను రెక్కీ చేస్తూ అర్ధరాత్రి తర్వాత దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర థార్ గ్యాంగ్ ముఠా సభ్యుల ఆటకట్టించారు సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు(Cyberabad CCS Police). ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
- థార్ గ్యాంగ్‌ల ఆటకట్టు.. ఆరుగురి అరెస్ట్
- 2 కేజీల బంగారం, 10కేజీల వెండి, రూ.8.5లక్షల నగదు దోపిడీ
- సొత్తు రికవరీ కోసం రంగంలోకి ప్రత్యేక టీమ్‌లు
- వివరాలు వెల్లడించిన క్రైమ్స్ డీసీపీ
హైదరాబాద్ సిటీ: శివారు ప్రాంతాల్లో తిష్టవేసి, ఖరీదైన ఇళ్లను రెక్కీ చేస్తూ అర్ధరాత్రి తర్వాత దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర థార్ గ్యాంగ్ ముఠా సభ్యుల ఆటకట్టించారు సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు(Cyberabad CCS Police). ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. చోరీలకు వెళ్లేముందు విజయవంతం చేయాలని ఈ గ్యాంగ్ కులదైవానికి మొక్కుతుంది. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, మియాపూర్ ఏసీపీ, సీసీఎస్ ఏసీపీ శశాంక్‌రెడ్డిలతో కలిసి క్రైమ్స్ డీసీపీ నరసింహ డీసీపీ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఈ వార్తను కూడా చదవండి: Celebrations: ఘనంగా బతుకమ్మ..
థార్ గ్యాంగ్‌లో ఓ ముఠానాయకుడిగా చెలామణి అవుతున్న కరణ్ మనోహర్‌బాబర్ తనతో పాటు.. పయార్‌సింగ్ బవులా, దెబ్రా బవులాతో సహా.. మరో ముగ్గురితో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ గ్యాంగ్ వచ్చిన కొద్దిరోజులకే కడక్‌సింగ్(Kadaksingh) అనే మరో ముఠా నాయకుడు ఠాగూర్ ఎథియా, కుమాన్ ఎథియా, మరో ముగ్గురితో కలిసి నగరానికి వచ్చాడు. ఈ రెండు గ్యాంగులపై సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి సహా.. మొత్తం 35 దొంగతనం కేసులు నమోదయ్యాయి.
వాటిలో మియాపూర్, పేట్ బషీరాబాద్ పరిధిలో నమోదైన 10 కేసుల్లో తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన పోలీస్ ఉన్నతాధికారులు మాదాపూర్, బాలానగర్ సీసీఎస్ పోలీస్ టీమ్‌లను రంగంలోకి దింపారు. టెక్నికల్ ఎవిడెన్స్, ఇతర సాంకేతిక, సైంటిఫిక్ ఆధారాలతో రెండు ముఠాలను పట్టుకున్న పోలీసులు మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.11,500, ఆరు కత్తులు, రెండు రాడ్లు, రెండు కట్టర్లు, 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో ఆసక్తికర విషయాలు
అరెస్ట్ అయిన దొంగల ముఠాను సీసీఎస్ పోలీసులు విచారించగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం థార్ జిల్లా గిరిజన తెగకు చెందిన వీరు చోరీల కోసం బయల్దేరేటప్పుడు అక్కడ కులదైవానికి మొక్కుకొని కత్తులు, రాడ్లు, కట్టర్లతో వెళ్తారు. చోరీలు చేసి సొత్తును ఇండోర్‌లో అమ్మిన తర్వాత గ్రామాలకు వెళ్లి అమ్మవారి వద్ద మొక్కు తీర్చుకుంటారు. తర్వాత ఆ డబ్బుతో జల్సాలు చేస్తూ.. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నట్లు తేలింది. ఇప్పటి వరకు 2 కిలోల బంగారం, 10 కిలోల వెండి, రూ. 8.50 లక్షలు చోరీచేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తం సొత్తును రికవరీ చేయడానికి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు క్రైమ్స్ డీసీపీ నరసింహ తెలిపారు.
ఇదికూడా చదవండి: Harish Rao: ఫీజుల చెల్లింపుల్లో సర్కారు నిర్లక్ష్యం
ఇదికూడా చదవండి: Mulugu: కాటేసిన పాము, కరెంటు!
ఇదికూడా చదవండి: విద్యుత్తు శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్
ఇదికూడా చదవండి: Investment Scam: స్టాక్ బ్రోకింగ్ పేరుతో.. ఘరానా మోసం!
Read Latest Telangana News and National News