Share News

Hyderabad: డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నైజీరియన్‌ అరెస్టు..

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:13 PM

దుస్తుల వ్యాపారం పేరుతో నగరానికి వచ్చిన నైజీరియన్‌ డ్రగ్స్‌ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అతని వద్ద రూ. 4 లక్షల విలువైన 16 గ్రాముల కొకైన్‌, రూ.20 వేల నగదు, ఐ-20 కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నైజీరియన్‌ అరెస్టు..

హైదరాబాద్‌ సిటీ: దుస్తుల వ్యాపారం పేరుతో నగరానికి వచ్చిన నైజీరియన్‌ డ్రగ్స్‌ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అతని వద్ద రూ. 4 లక్షల విలువైన 16 గ్రాముల కొకైన్‌, రూ.20 వేల నగదు, ఐ-20 కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ. 16 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రష్మిక పెరుమాళ్‌(Task Force DCP Rashmika Perumal) బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఒకారో కాస్మోస్‌ రామ్‌సే అలియాస్‌ ఆండీ 2014లో బిజినెస్‌ వీసాపై ఢిల్లీకి వచ్చాడు. అక్కడి నుంచి నైజీరియాకు దుస్తులు ఎగుమతి చేసేవాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి షేక్‌పేటలో స్థిరపడ్డాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు రౌడీషీటర్ల అరెస్టు


దుస్తుల వ్యాపారం చేస్తున్నట్లు నటించి వాటి మాటున నైజీరియా నుంచి మాదకద్రవ్యాలు దిగుమతి చేసుకొని సరఫరా చేసేవాడు. 2016లో మరో నైజీరియన్‌ అబ్రహం జాకబ్‌ ఉకోహోతో కలిసి జైలుపాలయ్యాడు. బయటకు వచ్చి బెంగళూరు(Bangalore)లో ఉన్న నైజీరియన్‌ ఒబాసితో కలిసి అక్కడ, హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. అండీ టెలీగ్రామ్‌ యాప్‌ను వినియోగిస్తూ వినియోగదారులను కోడ్‌ భాషలో సంప్రదిస్తూ గుట్టుగా కొకైన్‌, డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాడు. దృష్టి సారించిన హెచ్‌ న్యూ ఇన్‌స్పెక్టర్‌ డానియెల్‌, ఫిల్మ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ బృందం సాంకేతిక ఆధారాలతో పట్టుకున్నారు. ఫిల్మ్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 02 , 2024 | 01:13 PM