Share News

Raksha Bandhan 2024: రాఖీ పౌర్ణమి.. శుభ ముహూర్తం ఎప్పుడంటే..? ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలంటే..?

ABN , Publish Date - Aug 16 , 2024 | 01:45 PM

రాఖీ పండగ.. ఆగస్ట్ 19వ తేదీ.. అంటే సోమవారం దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. శ్రావణ పౌర్ణమి రోజు.. దాదాపుగా ప్రతీ సోదరి.. తన సోదరుడు లేదా సోదర సమానుడి చేతి మణికట్టుకు ఈ రాఖీ కడుతుంది. సోదరుడు తనకు ఎల్లకాలం రక్షణగా నిలవడమే కాకుండా.. తనపై ప్రేమాభిమానులు కురిపించాలని ప్రతీ సోదరి భావిస్తుంది. అందుకు ప్రతీకగా సోదరుడి చేతికి రాఖీ కడుతుంది.

Raksha Bandhan 2024: రాఖీ పౌర్ణమి.. శుభ ముహూర్తం ఎప్పుడంటే..? ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలంటే..?

రక్తసంబంధీకుల మధ్య అనురాగ బంధానికి అసలు సిసలు ప్రతీక.. రాఖీ పౌర్ణమి. ఈ ఏడాది ఈ పండగ.. ఆగస్ట్ 19వ తేదీ.. అంటే సోమవారం దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. శ్రావణ పౌర్ణమి రోజు.. దాదాపుగా ప్రతీ సోదరి.. తన సోదరుడు లేదా సోదర సమానుడి చేతి మణికట్టుకు ఈ రాఖీ కడుతుంది. సోదరుడు తనకు ఎల్లకాలం రక్షణగా నిలవడమే కాకుండా.. తనపై ప్రేమాభిమానులు కురిపించాలని ప్రతీ సోదరి భావిస్తుంది. అందుకు ప్రతీకగా సోదరుడి చేతికి రాఖీ కడుతుంది.

raksha-bandan-1.jpg


రక్షా బంధన్ తేదీ సమయం

  • రక్షా బంధన్ సోమవారం ఆగస్ట్ 19, 2024

  • రక్షా బంధన్ రాఖీ వేడుక (Thread Ceremony) 01:30 PM నుంచి 09:08 PM వరకు

  • అపరాహ్న రక్షా బంధన్ ముహూర్తం 01:43 PM నుంచి 04:20 PM వరకు

  • ప్రదోష రక్షా బంధన్ ముహూర్తం 06:56 PM నుంచి 09:08 PM వరకు

  • రక్షా బంధన్ భద్ర పూజ 09:51 AM నుంచి 10:53 AM వరకు

  • రక్షా బంధన్ భద్ర ముఖ 10:53 AM నుంచి 12:37 PM వరకు

  • రక్షా బంధన్ భద్ర ముగిసే సమయం.. 01:30 PM

    raksha-2.jpg


హిందూ సంప్రదాయం ప్రకారం రాఖీ కట్టడానికి అత్యంత అనుకూలమైన సమయం అపరాహ్న కాలం, అంటే మధ్యాహ్నం. మతపరమైన వేడుకలతోపాటు ఆచారాలను నిర్వహించేందుకు ఈ అపరహ్నాన్ని అనుకూలమైన సమయంగా పరిగణిస్తారు. అయితే అపరాహ్నము వేళ కుదరకుంటే.. సాయంత్రం ప్రదోష సమయం కూడా అనుకూలమైనదిగా పరిగణించ వచ్చని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు.

rakshabndan-3.jpg


ఇక భద్ర సమయంలో ఈ రక్షా బంధన్ ఆచారాలను నిర్వహించకుండా ఉండడమే మేలని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ భద్ర సమయం.. హిందూ మత గ్రంధ్రాల ప్రకారం అంత అనువైన కాలం కాదని పేర్కొంటున్నారు. పౌర్ణమి తిథి ప్రథమార్థంలో భద్రం వస్తుంది. దీంతో ఆ యా సమయంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదని ఆ యా గ్రంధాలు సైతం సూచిస్తున్నాయి.

raksha-bandan-4.jpg


రాశిచక్రం ప్రకారం రాఖీని ఎంచుకోవడం వల్ల సోదరుడి ఆరోగ్యం, వృత్తి, వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆ క్రమంలో.. ఏ రాశివారికి ఏ రంగు రాఖీ కట్టాలంటే..

1) మేష రాశి: ఈ రాశి వారికి రక్షాబంధన్ రోజున సోదరీమణులు ఎరుపు రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో కుజుడు బలపడతాడు.

2) వృషభ రాశి: ఈ రాశి వ్యక్తులకు రక్షాబంధన్ రోజున తెల్లటి రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో శుక్రుడు ధృడపడతాడు.

3) మిధున రాశి: ఈ రాశి సోదరులకు రక్షాబంధన్ రోజున ఆకుపచ్చ రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో బుధ గ్రహం శక్తిమంతుడు అవుతాడు.

4) కర్కాటక రాశి: రక్షాబంధన్ రోజున ఈ రాశి వారికి తెల్లని రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలపడతాడు.

5) సింహ రాశి: రక్షాబంధన్ రోజున ఈ రాశి వారికి వారి సోదరీమణులు పసుపు లేదా ఎరుపు రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో రవి ప్రకాశవంతంగా మారతాడు.

6) కన్య రాశి: ఈరక్షాబంధన్ రోజున ఈ రాశి వారికి వారి సోదరీమణులు పచ్చ రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో బుధ గ్రహం బలపడుతుంది.

7) తులా రాశి: ఈ రోజు.. ఈ రాశి వారికి తెల్లటి రంగు రాఖీని కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో శుక్రుడుతోపాటు చంద్రుడు సైతం శక్తిమంతంగా మారతాడు.

8) వృశ్చిక రాశి: రక్షాబంధన్ రోజు.. ఈ రాశి వారికి వారి సోదరీమణులు ఎరుపు రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో కుజుడు మరింత బలపడతాడు.

9) ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన సోదరులకు పసుపు రంగు రాఖీని కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో కుజుడు శక్తివంతంగా మారతాడు.

10) మకర రాశి: ఈ రాశికి చెందిన వారికి వారి సోదరీమణులు నీలం రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో శని బలపడి శుభాలు కలుగుతాయి.

11) కుంభ రాశి: ఈ రాశికి చెందిన వారికి వారి సోదరీమణులు నీలి రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో శని బలపడతాడు.

12) మీనరాశి: ఈ రాశి వారికి వారి సోదరీమణులు పసుపు రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో కుజుడు శక్తిమంతంగా మారతాడు.

Updated Date - Aug 16 , 2024 | 01:54 PM