Share News

IBPS: బ్యాంకు ఉద్యోగాలు.. 6,218 పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు విధానం ఇదే

ABN , Publish Date - Jul 03 , 2024 | 05:10 PM

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 6,128 క్లర్క్ పోస్టుల కోసం 2025-26 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష కోసం దరఖాస్తులను సమర్పించవచ్చు.

IBPS: బ్యాంకు ఉద్యోగాలు.. 6,218 పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు విధానం ఇదే

ఇంటర్నెట్ డెస్క్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 6,128 క్లర్క్ పోస్టుల కోసం 2025-26 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష కోసం అధికారిక వెబ్‌సైట్ లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ జులై 21. IBPS క్లర్క్ ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టులో జరగనుండగా, అక్టోబర్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

IBPS రిక్రూట్‌మెంట్(2024) వివరాలు..

వయో పరిమితి

01.07.2024 నాటికి, అభ్యర్థి తప్పనిసరిగా 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1996 నుంచి 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

అర్హతలు

  • అభ్యర్థి గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ పట్టా పొంది ఉండాలి. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా సమానమైన అర్హతను కలిగి ఉండాలి.

  • కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.


దరఖాస్తు రుసుము

SC/ST/PwBD/ESM/DESM అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 175(GSTతో కలిపి)గా ఉండగా, ఇతరులందరికీ రూ. 850(GSTతో కలిపి)గా ఉంది. ఈ ఉద్యోగాలకు జులై 21, 2024లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం

ప్రిలిమ్స్ పరీక్ష పేపర్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ విభాగాలు ఉన్నాయి. ఇందులో 100 మార్కుల ప్రశ్నలు 100 ఉంటాయి. ఒక్క తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా ప్రతి మూడు పరీక్షలలో అర్హత సాధించాలి. IBPS నిర్వహించే సురక్షితమైన కట్-ఆఫ్ మార్కులను కలిగి ఉండాలి. అలా ఆన్‌లైన్ మెయిన్ పరీక్షకు తగిన సంఖ్యలో అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అవుతారు. పరీక్ష.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) విధానంలో జరుగుతుంది.

IBPS ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ ఇంగ్లీష్, హిందీ సహా 13 ప్రాంతీయ భాషలలో ఉంటుంది. అవి తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో ఉంటాయి. IBPS ప్రిలిమ్స్ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. రెండింటినీ తప్పనిసరిగా రాయాలి. ఏదైనా సెషన్‌కు హాజరుకాకపోతే అనర్హత వేటు పడుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.


దరఖాస్తు చేయండిలా..

  • లింక్ క్లిక్ చేసి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

  • CRP - క్లర్క్స్ - XIV ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

  • దరఖాస్తు చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి.

  • నమోదు చేసుకోవడానికి అకౌంట్‌ను సృష్టించండి.

  • తరువాత లాగిన్ చేయండి. దరఖాస్తు విధానాన్ని పూర్తి చేయండి. రుసుము చెల్లించండి.

  • భవిష్యత్తు సూచన కోసం నిర్ధారణ పేజీని(Confirmation Page) డౌన్‌లోడ్ చేయండి.

For Latest News and National News click here

Updated Date - Jul 03 , 2024 | 05:11 PM