AP High Court: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్
ABN , Publish Date - Mar 27 , 2025 | 08:39 PM
Sajjala Ramakrishna Reddy: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ రెడ్డిలకు ఏపీ హై కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

అమరావతి: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ రెడ్డిలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ గురువారం నాడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సినీనటుడు పోసాని కృష్ణ మురళి ఇచ్చిన నేర అంగీకార పత్రంలో తాము ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడానని చెప్పిన అంశంలో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్‌లో సజ్జల పిటీషన్ దాఖలు చేశారు. ఈ నేర అంగీకార పత్రం ద్వారా ఓబులవారి పల్లె పోలీసులు తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని పిటీషన్‌లో సజ్జల ప్రస్తావించారు. ఒక్కొక్కరూ రూ.10 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తునకు సజ్జల సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది.
కాగా.. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో వారు పిటిషన్ దాఖలు చేశారు. సజ్జల ఇచ్చిన స్క్రిఫ్ట్, ప్రోత్సాహంతోనే సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు, కమ్మ సామాజికవర్గంపై అభ్యంతరకరంగా ధూషించానని సినీ నటుడు పోసాని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీని ఆధారంగా పోలీసులు తమను అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్‌రెడ్డి పిటిషన్‌లో ప్రస్తావించారు. పోసానిని మొదటి నిందితుడిగా పేర్కొంటూ ఓబుళవారిపల్లె పోలీసులు నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు
ఈ వార్తలు కూడా చదవండి..
Jayamangala చంద్రబాబు కాళ్ల మీద పడ్డ వైపీసీ మాజీ నేత
CM Chandrababu: పోలవరం ప్రాజెక్టు సందర్శనకు..
Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. పలు చోట్ల ఉద్రిక్తత
For More AP News and Telugu News