UH Lived Hindu course: అమెరికా యూనివర్సిటీలో వివాదాస్పద కోర్సు.. మండిపడుతున్న హిందూ విద్యార్థులు
ABN , Publish Date - Mar 27 , 2025 | 09:15 PM
యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌లో హిందూమతంపై ప్రవేశపెట్టిన కోర్సు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఇందులోని అంశాలు హిందూద్వేషం పెంచేలా ఉన్నాయని అక్కడి భారతీయ విద్యార్థి యూనివర్సిటీకి ఫిర్యాదు చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్..హిందూమతంపై ప్రవేశపెట్టిన కోర్సు వివాదానికి దారి తీసింది. ఈ కోర్సులోని అంశాలు హిందూమతంపై ద్వేషం పెంచేలా ఉన్నాయని పలువురు భారతీయ విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత రాజకీయ పరిస్థితులపై ఈ కోర్సు తప్పుడు అభిప్రాయం కల్పిస్తుస్తోందని ఆరోపించారు. అయితే, విద్యార్థుల అభ్యంతరాలను పరిశీలిస్తున్నట్టు యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది.
లివ్డ్ హిందూ రిలిజియన్ కోర్సుపై ప్రస్తుతం వివాదం చెలరేగుతోంది. ఆన్‌లైన్‌లో చెప్పే ఈ కోర్సును ప్రొఫెసర్ ఆరాన్ మైఖేల్ ఉల్రే బోధిస్తున్నారు. హ్యూస్టన్ యూనివర్సిటీ విద్యార్థి, హిందూ అమెరికన్ సామాజిక కార్యకర్త వసంత్ భట్ ఈ కోర్సులోని పలు అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘హిందూ అనే పదం సనాతనమైనది కాదని ప్రొఫెసర్ ఉల్రే బోధిస్తున్నారు. ఈ భావన బ్రిటిష్ పాలకుల సృష్టిగా చెబుతున్నారు. హిందూ జాతీయ వాదులు ఈ భావనను ఆయుధంగా చేసుకుని మైనారిటీలను అణగదొక్కుతున్నారని చెబుతున్నారు’’ అని వసంత్ భట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీని కూడా ఛాందసవాదిగా ప్రొఫెసర్ పేర్కొన్నారని ఆరోపించారు.
Also Read: రియాధ్‌లో భారతీయ కార్మికులకు భోజన సామగ్రిని అందించిన తెలుగు ఎన్నారైలు
భారత్ అధికారిక మతంగా హిందూమతం ఉండాలని కోరుకుంటున్న వారు తమ మతాన్ని ఇలా పిలిచుకుంటారని ప్రొఫెసర్ బోధిస్తున్నట్టు వసంత్ భట్ తెలిపారు. ఇతర మతాల్ని కించపరిచేందుకు వాడుతున్నారని సదరు అధ్యాపకుడు బోధిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఆమోదయోగ్యమే కానీ అతివాదం వ్యాప్తి చేయడం మాత్రం మంచిది కాదని హితవు పలికారు.
ఈ కోర్సుపై అభ్యంతరం చెబుతూ డీన్‌కు ఫిర్యాదు చేసినా తన సమస్యకు పరిష్కారం లభించలేదని వసంత్ వాపోయారు. చర్చను ఇతర అంశాలవైపు మళ్లించేందుకు యూనివర్సిటీ మత అధ్యయన విభాగం ప్రయత్నించిందని ఆరోపించారు. తన అభ్యంతరాలను కొట్టిపారేసే ప్రయత్నం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు వెలుగు చూశాయని, ఇది అమెరికా యూనివర్సిటీల్లో నాటుకుపోయిన సమస్య అని అన్నారు. ఇప్పటికే హిందూద్వేషం పెరుగుతున్న అమెరికాలో ఇలాంటి కోర్సులు తప్పుడు సమాచార వ్యాప్తికి దారి తీస్తాయని అన్నారు.
Also Read: బహ్రెయిన్ తెలుగు కళా సమితి ఇఫ్తార్ విందులో అరబ్బు ప్రముఖులు
ఈ కాంట్రవర్సీపై అమెరికాలోని హిందువులు కూడా స్పందించారు. దశాబ్దాలుగా అమెరికాలో హిందూ ద్వేషం కొనసాగుతోందని అన్నారు. 1990ల్లోనే తాను ఈ విషయాన్ని ప్రస్తావించినా అప్పట్లోనే తన వాదనలను కొట్టిపారేశారని న్యూజెర్సీకి చెందిన భారత సంతతి రచయిత రాజీవ్ మల్హోత్రా అన్నారు.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి

డాలస్‌లో టీపాడ్ బ్లడ్ డ్రైవ్.. వెల్లువెత్తిన స్పందన

తానా సదస్సుకు ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండికి ఆహ్వానం

TANA: జులైలో డెట్రాయిట్లో 24వ తానా మహా సభలు

బహ్రెయిన్‌లో వైభవంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలుగు ఎన్నారైలకు దుబాయిలో జీఎమ్సీ ఇఫ్తార్ విందు
