Share News

Banana: రోజూ ఒక అరటిపండును నెల రోజులు వరుసగా తినండి.. ఈ వ్యాధులన్నీ మాయం..!

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:36 PM

రోజూ ఒక అరటిపండును నెల రోజులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జరిగేది ఇదే..

Banana: రోజూ ఒక అరటిపండును నెల రోజులు వరుసగా  తినండి.. ఈ వ్యాధులన్నీ మాయం..!
Banana

అరటి పండ్లు పోషకాహారంలో భాగంగా తీసుకుంటారు. చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినగలిగే పండు అరటి పండే. అరటిపండ్లలో విటమిన్-బి3, బి6, బి12 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. రోజూ ఒక అరటిపండును నెల రోజులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊహించని ఫలితాలు ఉంటాయని, కొన్ని వ్యాధులు నయం అవుతాయని అంటున్నారు ఆహార నిపుణులు. అవేంటో తెలుసుకుంటే..

ఖాళీ కడుపుతో అంజీర్ నీరు తాగితే ఏం జరుగుతుందంటే..!


అరటి పండును నెలరోజులు తింటే..

  • అరటిపండును ఒక నెలపాటు నిరంతరం తినడం వల్ల పొట్టకు చాలా ప్రయోజనం చేకూరుతుంది. ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్దకానికి సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

  • అరటిపండు బీపీని అదుపులో ఉంచుతుంది. రోజూ ఒక అరటిపండు తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

  • అరటిపండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.

ఏడాదికి ఒకసారి ఈ 6 రకాల రక్త పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యం సేఫ్..!


పోషకాలు..

ఒక మీడియం సైజ్ అరటిపండును రోజూ తింటే దాన్నుండి లభించే పోషకాలు కింది విధంగా ఉంటాయి.

కేలరీలు.. 105

కార్బోహైడ్రేట్స్.. 27గ్రాములు

ఫైబర్.. 3 గ్రాములు

చక్కెరలు.. 14 గ్రాములు

ప్రోటీన్.. 1గ్రాము

సోడియం.. 1.18 మి.గ్రా

పొటాషియం.. 4.22మి.గ్రా

అరటిపండులో కొవ్వులు ఏమీ ఉండవు.

ఇవి కూడా చదవండి..

బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే.. ఈ ఒక్క జ్యూస్ తాగండి చాలు..!

శరీరానికి ఎంతగానో ఉపయోగపడే ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాలు ఇవే..!

ఉల్లిపాయ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య లాభాల లిస్ట్ ఇదీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 10 , 2024 | 03:36 PM