Share News

Vitamin D deficiency: అతిగా చెమటలు వస్తున్నాయా.. ఆ లోపం ఉన్నట్టే

ABN , Publish Date - Aug 05 , 2024 | 04:53 PM

చెమటలు పట్టడమనేది సహజ ప్రక్రియ. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో, దుమ్ముధూళిని తొలగించడంలో చెమట ఉపయోగపడుతుంది. అయితే అతిగా చెమట వస్తే సమస్యే అంటున్నారు వైద్యులు.

Vitamin D deficiency: అతిగా చెమటలు వస్తున్నాయా.. ఆ లోపం ఉన్నట్టే

ఇంటర్నెట్ డెస్క్: చెమటలు పట్టడమనేది సహజ ప్రక్రియ. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో, దుమ్ముధూళిని తొలగించడంలో చెమట ఉపయోగపడుతుంది. అయితే అతిగా చెమట వస్తే సమస్యే అంటున్నారు వైద్యులు. ఈ పరిస్థితిని హైపర్ హైడ్రోసిస్ అని అంటారు. అతిగా చెమట రావడం మనిషి అనారోగ్యంగా ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తుంది. విటమిన్ డి లోపం వల్ల అతిగా చెమట వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడటంలో విటమిన్ డి కీలకం. బలమైన ఎముకలు, దంతాలకు అవసరమైన కాల్షియం, భాస్వరాన్ని విటమిన్ డి అందిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ, హృదయనాళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

విటమిన్ డి లోపానికి కారణాలు..

సూర్యరశ్మి తక్కువగా ఉన్న ప్రదేశాలలో నివసించడం, బట్టలు లేదా సన్‌స్క్రీన్‌తో శరీరానికి సూర్యకాంతి తగలనివకుండా చేయడం.. ఎక్కువ సమయం ఇంటి లోపల గడపడం విటమిన్ డి లోపానికి దారితీస్తాయి. విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకపోయినా డి విటమిన్ లోపం ఏర్పడుతుంది. ఊబకాయం ఉన్నవారిలో శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వారి రక్తప్రవాహంలో విటమిన్ డి తక్కువ స్థాయిలో ఉంటుంది.

చెమట శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అయినప్పటికీ మనం శారీరకంగా చురుకుగా లేనప్పుడు లేదా వెచ్చని వాతావరణంలో ఉన్నప్పుడు కూడా మన శరీరం అధికంగా చెమటను ఉత్పత్తి చేస్తుంది. అది విటమిన్ డి లోపం వల్లే అని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ డి స్వేద గ్రంథుల్లో నుంచి వచ్చే చెమట ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ డి లోపించినప్పుడు, ఈ గ్రంథులు అత్యంత చురుగ్గా పనిచేస్తాయి. అవసరమైన దానికంటే ఎక్కువ చెమటను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా అధిక చెమట వస్తుంది.


విటమిన్ డి లోపాన్ని సూచించే ఇతర లక్షణాలు..

అలసట: శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి సరిపడినంత లేకపోతే తగినంత నిద్ర పోయినా అలసట వస్తుంది.

కండరాల బలహీనత: కండరాల పెరుగుదల, పనితీరుకు విటమిన్ డి అవసరం. డి విటమిన్ లోపం కండరాల బలహీనతకు దారితీస్తుంది. రోజువారీ పనులను కష్టతరం చేస్తుంది.

మానసిక స్థితి మార్పులు: విటమిన్ డి ని "సన్‌షైన్ విటమిన్" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెరోటోనిన్ మన మానసిక స్థితిని నియంత్రించే హార్మోన్. డి విటమిన్ సరిపడినంత లేకపోవడం మానసిక కల్లోలం, నిరాశకు దారితీస్తుంది.

ఎముకల నొప్పి: ఆరోగ్యకరమైన ఎముకల కోసం కీలకమైన కాల్షియం, ఫాస్పరస్‌ని అందించడంలో విటమిన్ డి సహాయపడుతుంది. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి.బోలు ఎముకల వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉంది.

జుట్టు రాలడం: జుట్టు ఎదుగుదలలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ లోపం వల్ల జుట్టు రాలడం లేదా సన్నబడుతుంది.

చికిత్స, నివారణ...

సప్లిమెంట్లతోపాటు, విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం ఎండలో వ్యాయామం చేయాలి. ఆరుబయట గడపాలి. తద్వారా విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు.

For Latest News and National News click here

Updated Date - Aug 05 , 2024 | 04:53 PM