Irregular Periods: పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లేదా? ఈ ఒక్క డ్రింక్ తాగి చూడండి..!
ABN , Publish Date - Jul 22 , 2024 | 01:28 PM
పీరియడ్స్ మహిళల జీవితంలో ఒక భాగం. సాధారణంగా నెలకు ఒకసారి వచ్చే ఈ పీరియడ్స్ వల్ల చాలామంది మహిళలు చిరాకు పడుతుంటారు. కానీ పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోతే భయపడుతుంటారు. నిజానికి మహిళల ఆరోగ్యాన్ని పీరియడ్స్ నిర్దేశిస్తుంటాయి.
పీరియడ్స్ మహిళల జీవితంలో ఒక భాగం. సాధారణంగా నెలకు ఒకసారి వచ్చే ఈ పీరియడ్స్ వల్ల చాలామంది మహిళలు చిరాకు పడుతుంటారు. కానీ పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోతే భయపడుతుంటారు. నిజానికి మహిళల ఆరోగ్యాన్ని పీరియడ్స్ నిర్దేశిస్తుంటాయి. అయితే నేటి కాలం జీవనశైలి. ఆహరపు అలవాట్లు, హార్మోన్ల అసమతుల్యత వంటివి పీరియడ్స్ రాకుండా చేస్తుంటాయి. మహిళలను గైనకాలజిస్ట్ ల చుట్టూ తిరిగేలా చేస్తుంటాయి. క్రమ రహిత నెలసరికి చెక్ పెట్టాలన్నా, పీరియడ్స్ తిరిగి రెగ్యులర్ గా రావాలన్నా ఆయుర్వేదం సూచించిన ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. ఆ పానీయం ఏంటో.. పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటే..
గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన పండ్లు, కూరగాయల లిస్ట్ ఇదీ..!
కావలసిన పదార్థాలు..
నల్ల ఎండుద్రాక్ష.. 7 నుండి 8
కుంకుమ పువ్వు.. చిటికెడు
చియా విత్తనాలు.. ఒక స్పూన్( నానబెట్టనవి)
తయారీ విధానం..
నల్ల ఎండుద్రాక్షను ఒక చిన్న గిన్నెలో వేసి నీరు పోసి నానబెట్టాలి. అదే విధంగా ఒక చిన్న గిన్నెలో చిటికెడు కుంకుమ పువ్వు వేసి అందులో నీళ్లు పోసి కొద్దిసేపు పక్కన పెట్టాలి. చియా విత్తనాలు కూడా నానబెట్టుకోవాలి.
నానబెట్టిన ఎండుద్రాక్షను ఒక గ్లాసులో పోయాలి. అందులో కుంకుమ పువ్వు నీరు కూడా వేయాలి. ఇందులో నానబెట్టుకున్న చియా విత్తనాలు ఒక స్పూన్ వేయాలి. ఈ మూడింటిలోకి కొద్దిగా నీరు జోడించాలి. ఈ పానీయాన్ని తాగాలి.
రక్తంలో చక్కెరను, చెడు కొలెస్ట్రాల్ ను వేగంగా తగ్గించే నేచురల్ డ్రింక్స్ ఇవి..!
నానబెట్టిన నల్ల ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు, పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి హార్మోన్లను నియంత్రించడంలో, నెలసరి అసౌకర్యం తగ్గించడంలో సహాయపడతాయి.
కుంకుమ పువ్వు నెలసరి సమయంలో వచ్చే నొప్పిని, నెలసరి కారణంగా వచ్చే మూడ్ స్వింగ్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
చియా సీడ్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది వాపును, హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో సహాయపడుతుంది.
రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే.. కాలేయ సమస్యలున్నట్టే..!
జాగ్రత్తలు..
కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా క్రమరహిత పీరియడ్స్ సమస్య నుండి బయటపడవచ్చు.
పీరియడ్స్‌కు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో యోగా లేదా వ్యాయామం చేయడం ప్రభావవంతంగా ఉంటుంది.
పీరియడ్స్ సరిగా రాకపోతే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఆహారంలో ఆరోగ్యంగా ఉంచే అవసరమైన పోషకాలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన శరీర బరువు కలిగి ఉంటే పీరియడ్స్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.
ఆహారంలో అల్లం, దాల్చిన చెక్కను చేర్చుకోవడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ రెండూ క్రమరహిత పీరియడ్స్ సమస్యను దూరం చేయడంలో సహాయపడతాయి.
ఈ 5 డ్రై ఫ్రూట్స్ ను ఉదయాన్నే అస్సలు తినకూడదు..!
ఈ పానీయాలు తాగితే చాలు.. చెడు కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గిపోతుంది..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.