Share News

Mangolia Flower: సంపెంగ పువ్వులు ఇలా వాడితే ఎన్ని లాభాలో..!

ABN , Publish Date - Jul 01 , 2024 | 02:23 PM

భారతీయుల జీవన విధానంలో పువ్వులకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. చాలావరకు పువ్వులను పూజకోసం, శుభకార్యాలలోనూ, మహిళలు జడలో అలంకరణ కోసం ఉపయోగిస్తారు. అయితే కొన్ని రకాల పువ్వులను వంటల్లోనూ, మరికొన్నింటిని టీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే..

Mangolia Flower: సంపెంగ పువ్వులు ఇలా వాడితే ఎన్ని లాభాలో..!

భారతీయుల జీవన విధానంలో పువ్వులకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. చాలావరకు పువ్వులను పూజకోసం, శుభకార్యాలలోనూ, మహిళలు జడలో అలంకరణ కోసం ఉపయోగిస్తారు. అయితే కొన్ని రకాల పువ్వులను వంటల్లోనూ, మరికొన్నింటిని టీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వీటిలో గులాబీ, మల్లె, బంతి, గుమ్మడి, కుంకుమ పువ్వు, చింత, మునగ వంటి పువ్వులు ప్రధానమైనవి. ఈ పువ్వులు రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూర్చుతాయి. అలాంటి కోవలోనిదే సంపెంగ పువ్వు కూడా. సంపెంగ పువ్వు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

Life Lesson: జీవితం మెరుగ్గా ఉండాలంటే ఈ 7 విషయాలను వదిలేయడం మంచిది..!



సంపెంగ మొక్క బెరడు, పువ్వులను చాలా ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ పువ్వుల నుండి తయారైన మందులు ఒత్తిడి, ఆందోళన, నిరాశ, బరువు తగ్గడం, జీర్ణసమస్యలు, మలబద్దకం, వాపు, తలనొప్పి, స్ట్రోక్, ఉబ్బసం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

సంపెంగ పువ్వుల సారం ఒత్తిడిని తగ్గించడానికి, నిద్ర మెరుగ్గా రావడానికి చక్కగా సహాయపడుతుంది.

జలుబు, ముక్కు కారడం, జలుబు కారణంగా ముక్కులు బ్లాక్ కావడం, సైనస్ నొప్పి, ముఖం మీద నల్ల మచ్చలు, తలనొప్పి.. మొదలైన సమస్యల నుండి ఉపశమనం కోసం సంపెంగ పువ్వుల మొగ్గలు ఉపయోగిస్తారు.

Monsoon Food: వర్షాకాలపు అనారోగ్యాలకు ఈ 5 కూరగాయలే కారణం.. వీటిని తినకండి..!



సంపెంగ పువ్వు మొగ్గను తీసుకుని నొప్పిగా ఉన్న దంతాలు, చిగుళ్ల మీద పూస్తే నొప్పి చాలా తొందరగా తగ్గిపోతుంది.

సంపెంగ పువ్వుల రెక్కలను విడదీసి నీటిలో వేసి ఉడికించాలి. తరువాత నీటిని వడగట్టి టీలా తాగాలి. ఇలా చేస్తే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

సంపెంగ మొగ్గలను వంటకాలలో కూడా ఉపయోగించవచ్చు. ఈ మొగ్గలతో చేసిన చట్నీ, ఊరగాయ, సలాడ్ మొదలైనవి తయారు చేయవచ్చు. సంపెంగ మొగ్గలు ఈ వంటలకు స్పైసీ రుచిని ఇస్తాయి. దీని రుచి కాస్త అల్లాన్ని పోలి ఉంటుంది.

Curry Leaves: రోజూ ఉదయాన్నే ఒక రెమ్మ పచ్చి కరివేపాకులు నమిలి తింటే జరిగేది ఇదే..!

Health Tips: ఈ 3 తినండి చాలు.. 60 ఏళ్లు వచ్చినా యవ్వనంగా ఉంటారు..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 01 , 2024 | 02:23 PM