Health: బరువు తగ్గేందుకు నడకకు మించిన ఎక్సర్‌సైజు లేదు! ఎందుకంటే..
ABN , Publish Date - Nov 02 , 2024 | 01:15 PM
అత్యంత ప్రభావశీలమైన కసరత్తుల్లో నడక కూడా ఒకటి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఇంతకు మించిన వ్యాయామం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అత్యంత ప్రభావశీలమైన కసరత్తుల్లో నడక కూడా ఒకటి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఇంతకు మించిన వ్యాయామం లేదని నిపుణులు చెబుతున్నారు. మరి దీనికి కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Health).
నడక హై ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజు. అంటే దీని వల్ల తక్కువ వ్యవధిలోనే కెలొరీలు అత్యధిక స్థాయిలో ఖర్చవుతాయి. వ్యక్తుల బరువు, నడుస్తున్న ప్రాంతం, నడక వేగాన్ని బట్టి గంటకు 600 నుంచి 1000 వరకూ కెలోరీలు ఖర్చవుతాయి. దీంతో, సులువుగా బరువుతగ్గుతారు.
Organic Foods: ఆర్గానిక్ ఫుడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయా? వైద్యుల చెప్పేదేంటంటే..
వివిధ రకాల ఉపరితలాలపై నడకతో కాళ్లు, శరీరంలోని వివిధ రకాల కండరాలు బలోపేతం అవుతాయి. అంతిమంగా ఎముకలు కూడా దృఢంగా మారతాయి.
కడుపు చుట్టూ ఉన్న కొవ్వు అనేక అనారోగ్యాలకు దారి తీస్తుంది. అయితే, నడకతో ఉదరభాగంలో కొవ్వు సులువుగా కరిగిపోతుంది. ఆరోగ్యం వేగంగా మెరుగవుతుంది.
నడకతో మానసిక ఆరోగ్యం కూడా మెరగవుతుంది. రోజూ నడిచే వారిలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇది మానసికోల్లాసం కలిగిస్తుంది. ఉత్సాహంగా పని చేస్తూ లక్ష్యాలు చేరుకునేలా చేస్తుంది.
Water Intoxication: అతిగా నీరు తాగుతున్నారా? వాటర్ ఇంటాక్సికేషన్ గురించి తెలిస్తే..
వేగంగా నడిస్తే జీవక్రియలు వేగవంతం అవుతాయి. నడక తరువాత కూడా జీవక్రియల వేగంగా అలాగే కొనసాగి కొవ్వు సులువుగా కరిగిపోతుంది.
ఇక నిపుణులు చెప్పేదాని ప్రకారం, రోజుకు కనీసం 20 నిమిషాల పాటు నడిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి, జిమ్‌లల్లో కసరత్తులు చేసినా చేయకపోయినా నడక మాత్రం కొనసాగించాలని నిపుణులు మరీ మరీ చెబుతున్నారు. దీంతో, అపారమైన ప్రయోజనాలను సులువుగా పొందొచ్చని అంటున్నారు.
Viral: రోజూ ఈ టైంలో 15 నిమిషాల పాటు ఎండలో నిలబడితే సమృద్ధిగా విటమిన్ డీ!