Share News

Sriram Krishnan : ట్రంప్‌ సలహాదారుగా శ్రీరాం కృష్ణన్‌

ABN , Publish Date - Dec 24 , 2024 | 06:20 AM

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్‌ ట్రంప్‌ సలహా మండలిలో మరో ఇండియన్‌-అమెరికన్‌ చేశారు. వెంచర్‌ క్యాపిటలిస్టుగా

Sriram Krishnan : ట్రంప్‌ సలహాదారుగా శ్రీరాం కృష్ణన్‌

కృత్రిమ మేధ విధానం రూపకల్పనకు నియామకం

వాషింగ్టన్‌, డిసెంబరు 23: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్‌ ట్రంప్‌ సలహా మండలిలో మరో ఇండియన్‌-అమెరికన్‌ చేశారు. వెంచర్‌ క్యాపిటలిస్టుగా పనిచేస్తున్న శ్రీరాం కృష్ణన్‌ను శ్వేత సౌధం సీనియర్‌ సలహాదారునిగా ట్రంప్‌ నియమించారు. కృత్రిమ మేధ (ఏఐ) విధానం రూపకల్పన, అమలుకు ఆయన సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. చెన్నైలో జన్మించిన కృష్ణన్‌ కాంచీపురంలోని ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో బీటెక్‌ చదివారు. 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 2005లో అమెరికా వెళ్లి మైక్రోసా్‌ఫ్టలో చేరారు. ట్విట్టర్‌, యాహూ, ఫేస్‌బుక్‌, స్నాప్‌లలో టీం లీడర్‌గా వ్యవహరించారు.

Updated Date - Dec 24 , 2024 | 06:20 AM