Blackout: అంధకారంలో మునిగిపోయిన ఈక్వెడార్..సంక్షోభానికి కారణమిదే..
ABN , Publish Date - Jun 20 , 2024 | 08:28 AM
ఈక్వెడార్(ecuador) దేశం బ్లాక్అవుట్(blackout)ను ఎదుర్కొంటుంది. ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ లైన్‌లో వైఫల్యం కారణంగా ఈక్వెడార్ అంతటా బుధవారం ఊహించని బ్లాక్‌అవుట్ ఏర్పడింది. దేశంలో విద్యుత్(electricity) ఉత్పత్తి సమస్యల కారణంగా ఊహించిన విద్యుత్తు అంతరాయం గురించి ప్రకటనలు వెలువడిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది.
ఈక్వెడార్(ecuador) దేశం బ్లాక్అవుట్(blackout)ను ఎదుర్కొంటుంది. ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ లైన్‌లో వైఫల్యం కారణంగా ఈక్వెడార్ అంతటా బుధవారం ఊహించని బ్లాక్‌అవుట్ ఏర్పడింది. దేశంలో విద్యుత్(electricity) ఉత్పత్తి సమస్యల కారణంగా ఊహించిన విద్యుత్తు అంతరాయం గురించి ప్రకటనలు వెలువడిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. ఈక్వెడార్ ఇంధన మంత్రి రాబర్టో లూక్ X (గతంలో ట్విట్టర్) ద్వారా ఈ మేరకు ప్రకటించారు. దేశం నేషనల్ ఎలక్ట్రిసిటీ ఆపరేటర్ ఈ లోపాన్ని గుర్తించిందని తెలిపారు. డిస్‌కనెక్ట్ వంటి పలు సమస్యల కారణంగా దేశంలో విద్యుత్ లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం విద్యుత్ లైన్లను తక్షణమే పరిష్కరించి సరిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈక్వెడార్‌లో బుధవారం తీవ్రమైన విద్యుత్ సంక్షోభం(Electricity crisis) తలెత్తి దేశం మొత్తం అంధకారంలో మునిగిపోయింది. బ్లాక్‌అవుట్ కారణంగా 18 మిలియన్ల మంది ప్రజలు చాలా గంటలు చీకటిలో ఉన్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో తాగునీరు దొరకడం లేదని, పరిస్థితి దారుణంగా తయారైందని అక్కడి మీడియా పేర్కొంది. మరోవైపు ఈక్వెడార్‌లో ఇంధన సంక్షోభం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇంధన సంక్షోభం కారణంగా ఈక్వెడార్‌లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో పొరుగు దేశాల నుంచి ఇంధనం తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈక్వెడార్‌లో ఇంధన సంక్షోభం(Electricity crisis) కొత్తేమీ కాదు అంతకుముందు ఏప్రిల్‌లో కూడా ఇక్కడ తీవ్రమైన ఇంధన సంక్షోభం ఏర్పడింది. కరువుతో అల్లాడుతున్న ఈక్వెడార్‌లోని రిజర్వాయర్ల నీటిమట్టం భారీగా పడిపోయింది. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి చేసే రిజర్వాయర్లలో నీటిమట్టం(water level) గణనీయంగా తగ్గడమేనని అంటున్నారు. ఈక్వెడార్ తన విద్యుత్ అవసరాల కోసం ఎక్కువగా జలవిద్యుత్ ప్లాంట్లపై ఆధారపడుతుంది.
ఇది కూడా చదవండి:
Bomb Threat: 50కిపైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు.. హెడ్ క్వార్టర్ పేల్చివేస్తామని..
Gold and Silver Rate: బంగారం ధరలు మళ్లీ తగ్గాయోచ్.. కానీ వెండి రేట్లు మాత్రం..
Read Latest International News and Telugu News