Share News

India Canada Row: నిజ్జర్ హత్య.. భారత్‌పై కెనడా ప్రధాని మరోసారి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

ABN , Publish Date - Mar 28 , 2024 | 09:06 PM

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తాము ఢిల్లీ ప్రమేయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేమని పేర్కొన్నారు.

India Canada Row: నిజ్జర్ హత్య.. భారత్‌పై కెనడా ప్రధాని మరోసారి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మరోసారి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తాము ఢిల్లీ ప్రమేయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేమని పేర్కొన్నారు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందనే ఆరోపణల్ని తాము అంత తేలికగా ప్రకటించలేదని అన్నారు. కెనడాకు చెందిన కేబుల్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ మీడియా ఛానల్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Mumbai Indians: ముంబై ఇండియన్స్ మరో షాక్.. ఆ స్టార్ ప్లేయర్ మరిన్ని ఆటలకు దూరం!

ఈ ఈవెంట్‌లో నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భారత్ సహకారం ఎలా ఉందనే ప్రశ్నకు ట్రూడో బదులిస్తూ.. భారత ప్రభుత్వంతో కలిసి తాము నిర్మాణాత్మకంగా పని చేయాలని చూస్తున్నామని బదులిచ్చారు. కెనడియన్ గడ్డపై ఓ కెనడియన్ పౌరుడి హత్య జరగడం.. తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని అన్నారు. ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని విశ్వసనీయ ఆరోపణలు వచ్చాయని, దీనిని అంత తేలిగ్గా కొట్టిపారేయలేమని చెప్పారు. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధ చర్యల నుంచి కెనడియన్లు రక్షించడం తమ బాధ్యత అని, అందుకే నిజ్జర్ హత్య విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నామని చెప్పుకొచ్చారు.


ఈ కేసులో తమ కెనడియన్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని.. న్యాయవ్యవస్థ, పోలీసు స్వాతంత్రానికి అనుగుణంగా పరిశోధనలు జరుగుతున్నాయని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయాలను మరింత లోతుగా తెలుసుకునేందుకు గాను.. భారత ప్రభుత్వంతో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని తెలిపారు. అదే సమయంలో.. కెనడియన్ పౌరులు ఏ అంతర్జాతీయ శక్తుల జోక్యానికి గురి కాకుండా (నిజ్జర్ హత్య లాంటి ఘటనలు పునరావృతం కాకుండా) తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అది తమ కర్తవ్యమని కెనడా ప్రధాని చెప్పుకొచ్చారు.

Yuvraj Singh: హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్‌ని బూతులు తిట్టిన యువరాజ్.. కారణం ఇదే!

ఇదిలావుండగా.. గతేడాది జూన్ నిజ్జర్‌ కెనడాలోని సర్రేలో గురుద్వారా బయట హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని అప్పట్లో ట్రూడో ఆరోపణలు చేయడంతో.. భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ కేసుపై తగిన ఆధారాలు ఇస్తే.. తాము తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పింది. కానీ.. కెనడా మాత్రం ఆధారాలు ఇవ్వడం లేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 09:06 PM