Share News

King Charles: రాజ దంపతుల విందు ఖర్చు ఎంతంటే..?

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:50 PM

దేశాల అధినేతలు, అధ్యక్షులు, రాజ కుటుంబీకులు పర్యటించిన సమయంలో ఆతిథ్య దేశం విందు ఇవ్వడం కామన్. బ్రిటన్ రాజ కుటుంబీకులు వస్తే ఖర్చు గురించి చెప్పక్కర్లేదు. రాజ కుటుంబానికి ఫ్రాన్స్ ప్రభుత్వం రాచ మర్యాదలు చేసింది. ఒక్క పూట భోజనం కోసం గ్రాండ్‌గా ఏర్పాటు చేసింది. ఇరు దేశాల అధికారులు, ప్రతినిధులు, డెలిగేట్స్, సినీ తారలు కలిపి 150 మందికి పైగా పాల్గొన్నారు. ఫ్రెంచ్ ఫుడ్, రకరకాల డిషెస్, వైన్, స్విట్ సర్వ్ చేశారు. ఖర్చు ఎంతయ్యిందో అనే విషయం ఆడిట్‌లో తేలింది.

King Charles: రాజ దంపతుల విందు ఖర్చు ఎంతంటే..?
King Charles

దేశాల అధినేతలు, అధ్యక్షులు, రాజ కుటుంబీకులు పర్యటించిన సమయంలో ఆతిథ్య దేశం విందు ఇవ్వడం కామన్. బ్రిటన్ రాజ కుటుంబీకులు (King Charles) వస్తే ఖర్చు గురించి చెప్పక్కర్లేదు. రాజ కుటుంబానికి ఫ్రాన్స్ ప్రభుత్వం రాచ మర్యాదలు చేసింది. ఒక్క పూట భోజనం కోసం గ్రాండ్‌గా ఏర్పాటు చేసింది. ఇరు దేశాల అధికారులు, ప్రతినిధులు, డెలిగేట్స్, సినీ తారలు కలిపి 150 మందికి పైగా పాల్గొన్నారు. ఫ్రెంచ్ ఫుడ్, రకరకాల డిషెస్, వైన్, స్విట్ సర్వ్ చేశారు. ఖర్చు ఎంతయ్యిందో అనే విషయం ఆడిట్‌లో తేలింది. ఒక్కపూట భోజనం కోసం ఇంత ఖర్చు చేశారా అని ఆశ్చర్యపోవడం ఖాయం.


అతిరథ మహారథులు

గత ఏడాది సెప్టెంబర్‌లో కింగ్ చార్లెస్ దంపతులు ఫ్రాన్స్ వచ్చారు. రాజ దంపతులకు అధ్యక్షుడు మాక్రాన్ స్వాగతం పలికారు. వెర్సైల్లెస్ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా విందు ఏర్పాటు చేశారు. బ్రిటన్- ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం విందు ఇచ్చారు. నటుడు హ్యుగ్ గ్రాంట్, ఫుట్ బాల్ మేనేజర్ ఆర్సేన్ వెంగర్, రోలింగ్ స్టోన్ మిక్ జాగర్ ఇలా 150 మంది వరకు పాల్గొన్నారు.


విందు

విందులో మంచి ఫ్రెంచ్ డిషెస్ ఏర్పాటు చేశారు. అరుదైన ఫ్రెంచ్ వంటకం బ్లూ లాబ్ స్టార్, పీతలు, ఫ్రెంచ్ పుట్టగొడుగులు గ్రాటిన్, షాంపైన్, వైన్, చీజ్, లిచీ, రోజ్ సోర్బెట్, రాస్‌బెర్రీ అందజేశారు. అన్ని రకాల వంటకాలు, డ్రింక్ సర్వ్ చేయడంతో ఖర్చు 5 లక్షల మిలియన్ డాలర్లు అయ్యింది. మన కరెన్సీలో అక్షరాల రూ.4 కోట్లు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ ఆడిటింగ్ సంస్థ కోర్ డెస్ కాంప్టెస్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఇలా దుబారా ఖర్చు చేయడం వల్ల బడ్జెట్‌లో 9 మిలియన్ డాలర్లు నష్టపోయాయని పేర్కొంది.


Hamas: ఇస్మాయిల్ ఇంటిపై దాడి, మృతి

ఫుడ్, డ్రింక్స్

కొత్త ఆడిట్ నివేదిక ప్రకారం బ్రిటన్ రాజుకు ఇచ్చిన డిన్నర్ ఖర్చు 5.13 లక్షల డాలర్ల కోసం అయ్యిందని వివరించింది. ఇందులో 1.79 లక్షల డాలర్లు ఆహారం కోసం ఖర్చు చేయగా, 46 వేల డాలర్లు డ్రింక్స్ కోసం ఖర్చు చేశారని పేర్కొంది. బ్రిటన్ రాజు కోసమే కాదు 2023లో భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ వెళ్లిన సమయంలో ఇలానే ఖర్చు చేశారు. లూవ్రే మ్యూజియంలో ఏర్పాటు చేసిన విందులో 4.46 లక్షల డాలర్లు ఖర్చు చేసింది. ఆ విధంగా ఏడాదిలో 9 లక్షల మిలియన్ డాలర్లకు పైగా ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం మంచినీళ్లలా డబ్బును వృథాగా ఖర్చు చేసింది.


Read Latest
International News and Telugu News

Updated Date - Jul 31 , 2024 | 12:54 PM