హమాస్‌కు ఖతార్ షాక్
ABN , Publish Date - Nov 11 , 2024 | 04:05 AM
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరు పక్షాలు అంగీకరించకపోవడంతో మధ్యవర్తిత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ఖతార్ ప్రకటించింది.
టెల్ అవీవ్, నవంబరు10: హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరు పక్షాలు అంగీకరించకపోవడంతో మధ్యవర్తిత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ఖతార్ ప్రకటించింది. అమెరికా తాజా సూచన మేరకు దోహాలో కార్యకలాపాలు ముగించాలని ఖతార్ హమా్‌సకు సూచించినట్లు సమాచారం. 2012లో అమెరికా సూచనమేరకే దోహాలో హమాస్ కార్యకలాపాలకు ఖతార్ అంగీకారం తెలిపింది. అయితే హమా్‌సను వెళ్లిపొమ్మన్నట్లు వస్తున్న కథనాలను ఖతార్ అధికార వర్గాలు తోసిపుచ్చాయి. మరోవైపు, గాజా, లెబనాన్‌లో కాల్పుల విరమణ కోసం యూఏఈ, కువైట్ పిలుపునిచ్చాయి.