-
-
Home » Mukhyaamshalu » Today Breaking News Telangana Budget Session 2025 AP Assembly Session Parliament Session Live Updates in Telugu News Wednesday 12th March 2025 NDN
-

Breaking News: ప్రస్తుతం నా పరిస్థితి ఇదే.. కుండబద్ధలు కొట్టిన రేవంత్
ABN , First Publish Date - Mar 12 , 2025 | 11:44 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-12T17:23:28+05:30
హనుమకొండ సమీపంలో ప్రమాదం
నడికూడ మండలం నర్సక్కపల్లి వద్ద ట్రాలీ ఆటో బోల్తా
15 మంది మహిళా కూలీలకు గాయాలు
ముగ్గురి పరిస్థితి విషమం, వరంగల్ ఎంజియం ఆస్పత్రికి తరలింపు
ప్రమాద సమయంలో ఆటోలో 30 మంది కూలీలు
బాధితులంతా కమలాపూర్ మండలం గూడూరు వాసులు
-
2025-03-12T16:04:53+05:30
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రవీంద్ర భారతిలో ఉద్యోగులకు నియామకపత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు అప్పగించి వెళ్లింది
ఆదాయం అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని ప్రజలు సహకరిస్తుంటే.. కేసీఆర్ కుటుంబానికి ఏమైంది
ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉంటామంటున్నారు
కేసీఆర్ మాత్రం ప్రభుత్వం దిగిపోవాలంటున్నారు
నేను అబద్ధాలు చెప్పను
అబద్ధాలతో.. తాతల పేర్లు చెప్పి ఇక్కడకు రాలేదు
కష్టాన్ని నమ్ముకుని ఇక్కడకు వచ్చాను
కష్టమైనా, నష్టమైనా ప్రజలకే చెప్పుకుంటాను
నాకు ఒక రూపాయి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు
కేసీఆర్ కాళేశ్వరం కట్టానని గొప్పలు చెప్పుకుంటున్నారు..
అది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం
-
2025-03-12T12:23:37+05:30
శాసనమండలిలో మార్షల్స్.. వైసీపీ అభ్యంతరం
వాయిదా అనంతరం ప్రారంభమైన శాసన మండలి
ఛైర్మన్ పోడియం చుట్టూ 23 మంది మార్షల్స్ ఏర్పాటు
మార్షల్స్ రక్షణ లో సభ కొనసాగింపు
మార్షల్స్ ఏర్పాటుపై వైసీపీ పక్షనేత బొత్స అభ్యంతరం
ఇది దుష్ట సంస్కృతి అన్న బొత్స
ఇది పెద్దల సభ.. ఇలా చేయడం సబబు కాదన్న ఛైర్మన్
మీ సీట్లలో ఉండి నిరసన తెలుపుకోవచ్చన్న ఛైర్మన్
కొనసాగుతున్న వైసీపీ సభ్యుల ఆందోళన
శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్
-
2025-03-12T12:23:36+05:30
రేపటికి తెలంగాణ అసెంబ్లీ వాయిదా
గవర్నర్ ప్రసంగం తర్వాత తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
గవర్నర్ ప్రసంగంలో అన్ని అవాస్తవాలు చెప్పారన్న బీఆర్‌ఎస్
గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్న కాంగ్రెస్
-
2025-03-12T11:56:11+05:30
బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు గవర్నర్ జిష్ణుదేవ్.
సమావేశాలకు సభ్యులందరూ విధిగా హాజరు కావాలన్నారు.
-
2025-03-12T11:56:10+05:30
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే తనకు చచ్చేంత ఇష్టమని అంటోంది ప్రభాస్ హీరోయిన్.
కోహ్లీ అంటే ఇష్టమని అంటోన్న ఆ భామ మరెవరో కాదు.. మాళవికా మోహనన్.
‘రాజా సాబ్’ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తోంది మాళవికా.
-
2025-03-12T11:52:57+05:30
టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని డ్యాన్స్ స్టెప్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
యంగ్ పించ్ హిట్టర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహ వేడుకలో ధోని మాస్ డ్యాన్స్‌తో అలరించాడు.
మాహీతో పాటు మరో సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా కూడా ఈ వేడుకలో సందడి చేశాడు.
-
2025-03-12T11:51:33+05:30
గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో సభలో లొల్లి లొల్లి చేసింది బీఆర్ఎస్.
సభ ముగిశాక కేటీఆర్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్‌తో కాంగ్రెస్ సర్కారు అబద్ధాలు చెప్పించిందని విమర్శించారు.
తెలంగాణలో 30 శాతానికి మించి రుణమాఫీ చేయలేదన్నారు కేటీఆర్.
కేసీఆర్, బీఆర్ఎస్‌పై కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు.
-
2025-03-12T11:49:47+05:30
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైపోయాయి.
మొదటి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తున్నారు.
రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలతో యువతలో నైపుణ్యం పెంచుతున్నామని తెలిపారు.
అభివృద్ధి, ప్రగతి దిశగా తెలంగాణ అడుగులు వేస్తోందన్నారు జిష్ణుదేవ్.
ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే సభ వాయిదా పడింది.