APS RTC: సంక్రాంతికి బెంగళూరు నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Jan 06 , 2024 | 10:32 AM
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బెంగళూరు(Bangalore) నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 11 నుంచి 13 వరకు ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ(APS RTC) నగరంలో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బెంగళూరు(Bangalore) నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 11 నుంచి 13 వరకు ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ(APS RTC) నగరంలో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, నెల్లూరు, కర్నూలు, కడప, ప్రొద్దుటూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతితో పాటు అన్ని ముఖ్యమైన పట్టణాలకు ఈ ప్రత్యేక బస్సు సేవలు ఉంటాయని, వీటికి రిజర్వేషన్ల బుకింగ్ కూడా ప్రారంభమైందని పేర్కొంది. అలాగే బెంగళూరు నుంచి తమ బంధువులు స్నేహితులకు ఏవైనా వస్తువులు పంపుకునేందుకు ప్రత్యేక కార్గో లాజిస్టిక్ సదుపాయం కూడా ఉందని, వీటిని వినియోగించుకోవాలని కోరారు. సంక్రాంతి ప్రత్యేక బస్సుల వివరాల కోసం 9880 540140కు ఫోన్ చేయాల్సి ఉంటుంది.