Share News

Election commission: ఎన్నికల ప్రక్రియ చిత్తశుద్ధినే శంకిస్తారా?.. ఖర్గే వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం

ABN , Publish Date - May 10 , 2024 | 05:35 PM

పోలింగ్ డేటాలోని వ్యత్యాసాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యక్తం చేసిన అనుమానాలు, ఎన్నికల ప్రక్రియ చిత్తశుద్ధిని ప్రశ్నించడంపై ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ఇది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై జరిపిన దాడిగా పేర్కొంది. ఈ మేరకు ఖర్గేకు ఈసీ శుక్రవారంనాడు లేఖ రాసింది.

Election commission: ఎన్నికల ప్రక్రియ చిత్తశుద్ధినే శంకిస్తారా?.. ఖర్గే వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం

న్యూఢిల్లీ: పోలింగ్ డేటాలోని వ్యత్యాసాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వ్యక్తం చేసిన అనుమానాలు, ఎన్నికల ప్రక్రియ చిత్తశుద్ధిని ప్రశ్నించడంపై ఎన్నికల సంఘం (Election Commission) తప్పుపట్టింది. ఇది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై జరిపిన దాడిగా పేర్కొంది. ఈ మేరకు ఖర్గేకు ఈసీ శుక్రవారంనాడు లేఖ రాసింది.


''రాజకీయ పార్టీలు, నేతలు ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకునేందుకు ఉన్న స్వేచ్ఛా హక్కును కమిషన్ పూర్తిగా గౌరవిస్తుంది. అయితే, ఎన్నికల ప్రక్రియ పూర్తయి, ఫలితాలు వెలువడేంతవరకూ ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించే పరిణామాలపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి ఉంటుంది''అని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న దశలో 'ఇండియా బ్లాక్‌' నేతలను ఉద్దేశించి ఖర్గే లేఖ రాయడం అవాంఛనీయమని స్పష్టం చేసింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఓటర్లలో అయోమయం నెలకొని, సజావుగా సాగే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుందని తప్పుపుట్టింది. వాస్తవాలకు భిన్నంగా ఖర్గే ఆరోపణలు ఉన్నాయని, వైద్యుడు ముందుగానే ఫలితాలు చెప్పినట్టుగా ఉందని పేర్కొంది. ఓటర్ల టర్నవుట్ డాటాను వెలువరించడంలో ఎలాంటి జాప్యం కానీ, నిర్వహణాలోపం కానీ జరగలేదని ఈసీ వివరణ ఇచ్చింది. ఎన్నికల రోజు లెక్కలకు, అప్డేడెట్ లెక్కలకు ఎప్పుడూ ఎంతో కొంత వ్యత్యాసం ఉంటుందనేది చాలా స్పష్టమని తెలిపింది. పోలింగ్ డాటాలోని వ్యత్యాసాలపై ఖర్గే వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని, కేవలం ఓటర్లలో గందరగోళం సృష్టించేందుకు చేసిన ప్రయత్నంగానే భావించాల్సి వస్తుందని తెలిపింది. మునుముందు ఎలాంటి తొందరపాటు ప్రకటనలు చేయకుండా సంయమనం పాటించాలని ఖర్గేకు సూచించింది.

Lok Sabha Elections: వాళ్లెంత ఆడిపోసుకున్నా శక్తిమాత అనుగ్రహమే నన్ను కాపాడుతోంది: మోదీ


ఖర్గే ఏమన్నారు?

ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటింగ్ డేటాలోని వ్యత్యాసాలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గత మంగళవారం 'ఇండియా' కూటమికి చెందిన వివిధ పార్టీల నేతలకు లేఖ రాశారు. శక్తివంతమైన ప్రజాస్వామ్య సంస్కృతి, రాజ్యాంగాన్ని పరిరక్షించడమే తమ అందరి లక్ష్యమని, పోలింగ్ డాటా వ్యత్యాసాలకు వ్యతిరేకంగా అందరూ తమ స్వరాన్ని పెంచాలని కూటమి నేతలను ఖర్గే తన లేఖలో కోరారు.

For More National News and Telugu News..

Updated Date - May 10 , 2024 | 05:35 PM