Share News

Police Seizes: పోలీసులకు చిక్కిన బంగారాన్ని మించిన పదార్థం.. 50 గ్రాములకే రూ.850 కోట్లు

ABN , Publish Date - Aug 10 , 2024 | 05:24 PM

మీరెప్పుడైనా బంగారం(gold), వజ్రాల కంటె విలువైన వాటి గురించి విన్నారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇటివల ఓ పోలీసుల(police) తనిఖీల్లో భాగంగా 50 గ్రాముల అత్యంత విలువైన రేడియోధార్మిక పదార్ధం కాలిఫోర్నియంను(Californium) స్వాధీనం చేసుకున్నారు. అయితే దాని విలువ సుమారు రూ. 850 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Police Seizes: పోలీసులకు చిక్కిన బంగారాన్ని మించిన పదార్థం.. 50 గ్రాములకే రూ.850 కోట్లు
californium seized worth Rs.850 crores

మీరెప్పుడైనా బంగారం(gold), వజ్రాల కంటె విలువైన వాటి గురించి విన్నారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇటివల ఓ పోలీసుల(police) తనిఖీల్లో భాగంగా 50 గ్రాముల అత్యంత విలువైన రేడియోధార్మిక పదార్ధం కాలిఫోర్నియంను(Californium) స్వాధీనం చేసుకున్నారు. అయితే దాని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ. 850 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ క్రమంలో ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒక గ్రాము కాలిఫోర్నియం ధర దాదాపు రూ.17 కోట్లు ఉంటుందని ఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న కాలిఫోర్నియా విలువ దాదాపు రూ.850 కోట్లు ఉంటుందని వెల్లడించారు. దీనిని ప్రధానంగా అణుశక్తి ఉత్పత్తి, మెదడు క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారని వెల్లడించారు.


గ్రాము ధర

బిహార్ STF, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్7, గోపాల్‌గంజ్ DIU, కుచయ్‌కోట్ పోలీస్ స్టేషన్‌ల సంయుక్త తనిఖీల్లో భాగంగా దీనిని పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా భద్రతా బలగాలు ముగ్గురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 50 గ్రాముల కాలిఫోర్నియం, విలువైన రేడియోధార్మిక పదార్థం కనుగొనబడింది. వీరితో పాటు ముగ్గురు స్మగ్లర్లు కూడా పట్టుబడ్డారు, వారిలో ఒకరు యూపీకి చెందినవారు కాగా, ఇద్దరు గోపాల్‌గంజ్‌కు చెందినవారు. అయితే ఇంటర్నెట్ ద్వారా అందిన సమాచారం ఆధారంగా 1 గ్రాము కాలిఫోర్నియం ధర దాదాపు రూ.17 కోట్లు పలుకుతోంది. దీని నమూనాను పరీక్షల నిమిత్తం మద్రాస్‌ ఐఐటీకి పంపించారు.


అప్రమత్తమైన పోలీసులు

అరెస్టయిన స్మగ్లర్ ఛోటాలాల్ ప్రసాద్ యూపీలోని ఖుషీనగర్ జిల్లా తమ్‌కుహి రామ్ పోలీస్ స్టేషన్ పర్సౌని గ్రామ నివాసి. చందన్ గుప్తా, చందన్ రామ్ అనే ఇద్దరు లైనర్లు గోపాల్‌గంజ్ పరిధిలోనివారు. ఈ పదార్థాన్ని విక్రయించేందుకు ఈ ముగ్గురు చాలా నెలలుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఆ క్రమంలో అప్రమత్తమైన SIT, SOG, DIU, స్థానిక కుచాయికోట్ పోలీస్ స్టేషన్‌ల బృందం నేతృత్వంలో తనిఖీలు నిర్వహించి వారిని పట్టుకుని విజయం సాధించారు.


తదుపరి చర్యలు

ఈ నేపథ్యంలో రూ. 850 కోట్ల విలువైన రేడియోధార్మిక పదార్థం కాలిఫోర్నియం రికవరీ కేసులో తదుపరి పోలీసు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని సంప్రదించే పనిలో ఉన్నారు. గోపాల్‌గంజ్ ఎస్పీ ఎఫ్‌ఎస్‌ఎల్‌కి చెందిన ప్రత్యేక బృందాన్ని పిలిచింది. దీని స్మగ్లింగ్, హ్యాండ్లింగ్, బ్యాక్‌వర్డ్ ఫార్వర్డ్ లింకేజీపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ తెలిపారు. దీంతోపాటు రేడియోధార్మిక పదార్ధం రికవరీకి సంబంధించి అరెస్టు చేసిన స్మగ్లర్లను కూడా మరింత విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Wayanad landslide: వయనాడ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 10 , 2024 | 05:31 PM