Lok Sabha Elections: నామినేషన్ వేసిన మేనక గాంధీ.. ఆ రెండు స్థానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - May 01 , 2024 | 04:47 PM
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మేనక గాంధీ బరిలో దిగుతున్నారు. ఆ క్రమంలో బుధవారం జిల్లా ఎన్నికల అధికారి కృతిక జోత్స్నకు ఆమె తన నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం కార్యాలయం వెలుపల మీడియా అడిగిన పలు ప్రశ్నలకు మేనక గాంధీ సమాధానం ఇచ్చారు. ఆ క్రమంలో అమేథీ, రాయిబరేలీ లోకసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంపై స్పందించాలని కోరారు.
లఖ్‌నవ్వ్, మే 1: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మేనక గాంధీ బరిలో దిగుతున్నారు. ఆ క్రమంలో బుధవారం జిల్లా ఎన్నికల అధికారి కృతిక జోత్స్నకు ఆమె తన నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం కార్యాలయం వెలుపల మీడియా అడిగిన పలు ప్రశ్నలకు మేనక గాంధీ సమాధానం ఇచ్చారు. ఆ క్రమంలో అమేథీ, రాయిబరేలీ లోకసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంపై స్పందించాలని కోరారు.
LokSabha Elections: కొన్ని గంటల్లో అమేథీ, రాయబరేలి అభ్యర్థుల ఎంపిక
ఆ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ.. తమ అభ్యర్థుల పేర్లు ఎప్పుడు ప్రకటిస్తుందో తనకు తెలియదన్నారు. ఆ యా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ గడువు మే 3వ తేదీతో ముగియనుందని ఈ సందర్బంగా ఆమె గుర్తు చేశారు. మరోవైపు సుల్తాన్‌పూర్ నుంచి మరోసారి గెలిపిస్తే.. ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద ప్రజలకు మరిన్నీ ఇళ్లు నిర్మించిన ఇస్తామని హామీ ఇచ్చారు.
TS High Court: కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు
లోక్‌సభ సభ్యురాలిగా గతంలో కష్టపడిన దానికి కంటే మరింత కష్టపడి పని చేస్తానని ఈ సందర్బంగా ఆమె స్పష్టం చేశారు. నామినేషన్ వేసిన సమయంలో మేనక వెంట నిషాద్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ నిషాద్, అప్నా దల్ నాయకుడు, కేంద్ర మంత్రి అషిష్ పటేల్ ఉన్నారు.
Salman Khan: నివాసం వద్ద కాల్పులు: నిందితుడు ఆత్మహత్య
బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం.. రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకు వస్తుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఈ సందర్భంగా ఖండించారు. అలాగే కుమారుడు వరుణ్ గాంధీ రాయబరేలి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో పిలిబిత్ లోక్‌సభ స్థానాన్ని వరుణ్ గాంధీకి బీజేపీకి కేటాయించక పోవడం గమనార్హం.
Read Latest National News And Telugu News